Reviewsవివేకం : రివ్యూ-రేటింగ్

వివేకం : రివ్యూ-రేటింగ్

కథ :-

అజయ్ కుమార్ (అజిత్) టెర్రరిజం రూపు మాపేందుకు అతని ధైర్య సాహసాలతో విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. నలుగురు స్నేహితులతో కూడిన తన టీం ఎలాంటి విషయాన్నైనా సమర్ధవంతంగా ఎదుర్కుంటుంది. ఇక ఈ సమయంలో కృత్రిమ భూకంపాలను సృష్టించే కుట్ర గురించి తెలియడంతో ఆ సీక్రెట్ మిషన్ ను కొలాప్స్ చేసేందుకు నటాషా (అక్షరా హాసన్) ను వెతికే క్రమంలో ఉంటాడు ఏకే. ఈ క్రమంలో అతనికి ఊహించని షాక్ తగులుతుంది. తన టీం లో ఉన్న స్నేహితులో అతన్ని మోసం చేస్తారు. అసలు అజిత్ ను వారెందరుకు టార్గెట్ చేశారు..? ఆ తర్వాత అతను ఎలా తన లక్ష్యం సాధించాడు అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :-

అజిత్ సినిమా అనగానే భారీ యాక్షన్ సీన్స్ ఊహించడం కామనే. ఈ సినిమాలో కూడా అంతే.. తన అభిమానులను ఏమాత్రం నిరాశ పరచకుండా అజిత్ నటన ఉంటుంది. వన్ మ్యాన్ షోగా అజిత్ అదరగొట్టేశాడు. ఇక సినిమాలో ఆర్యన్ గా నటించిన వివేక్ ఓబెరాయ్ కూడా బాగా చేశాడు. అజిత్, వివేక్ ల మధ్య సీన్స్ ఆడియెన్స్ కు త్రిల్ కలిగిస్తాయి. కాజల్ తన పాత్ర వరకు పర్వాలేదు అనిపిచగా అక్షరా హాసన్ కొద్దిపాత్రే అయినా అలరించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :-

వివేకం టెక్నికల్ టీం విషయానికొస్తే.. సినిమాను టాప్ క్లాస్ లో నిలబెట్టేలా టెక్నికల్ గా బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. సినిమా అంతా ఫారిన్ లొకేషన్స్ లో రిచ్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ హైలెట్ అని చెప్పొచ్చు. ఇక అనిరుధ్ మ్యూజిక్ పర్వాలేదు కాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దర్శకుడు శివ అందించిన కథ కథనాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే కథనంలో కమర్షియల్ సినిమా కాబట్టి కొన్ని రొటీన్ సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఫ్యాబ్యులస్ గా ఉన్నాయని చెప్పొచ్చు.

విశ్లేషణ :-

శివ డైరక్షన్ లో అజిత్ ఇప్పటికే రెండు సినిమాలను హిట్ కొట్టాడు. ఆ క్రేజీ కాంబినేషన్ అనగానే కోలీవుడ్ లో అంచనాలు పెరిగాయి. ఇక టీజర్ ట్రైలర్ అయితే సినిమామీద సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది. కథ కొత్తగా అనిపించినా కథనంలో దర్శకుడు శివ కాస్త కన్ ఫ్యూజ్ చేయడం వల్ల సినిమా సాధారణ ప్రేక్షకుడికి అర్ధం కాని విధంగా ఉంటుంది.

ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయంలో కూడా కాస్త రొటీన్ పంథాలో వెళ్లినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్నా కొన్ని మాత్రం మళ్లీ రొటీన్ గానే నడిపించాడు. ముఖ్యంగా సీక్రెట్ ఆపరేషన్ ను డీ కోడ్ చేసే క్రమంలో సన్నివేశాలు రక్తికట్టించాయి. సినిమాను ఇంకాస్త క్లారిటీగా తీసుకుంటే ఇంకా బాగా వచ్చేదని చెప్పొచ్చు.

తెలుగులో అజిత్ కు మాములు ఫాలోయింగ్ ఉంటుంది. కాని తమిళంలో మాత్రం అక్కడ తల ఫ్యాన్స్ కు బాగా నచ్చే సినిమా అవుతుంది. టెక్నికల్ గా బాగా కష్టం కనిపిస్తున్న ఈ సినిమా కథ కథనాల విషయంలో శివ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాల కన్నా ఓ హాలీవుడ్ రేంజ్ ట్రీట్ మెంట్ ఉన్న సినిమాగా వివేకం యూత్ కు నచ్చే అవకాశం ఉంది.

ప్లస్ పాయింట్స్ :-

అజిత్

టెక్నికల్ ఎఫర్ట్

లొకేషన్స్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :-

కన్ ఫ్యూజ్ స్క్రీన్ ప్లే

రొటీన్ సీన్స్

బాటం లైన్ :-

అజిత్ వివేకం..స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్

రేటింగ్ :- 2/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news