Sportsసచిన్‌ ను అధిగమించేసిన విరాట్‌

సచిన్‌ ను అధిగమించేసిన విరాట్‌

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టార్గెట్ రీచ్‌ కావడంలో తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ తో పాటు కోహ్లి దూకుడుగా ఆడటంతో 217 పరుగుల లక్ష్యాన్ని భారత్ 28.5 ఓవర్లలోనే ఛేదించేశారు. ఈ మ్యాచ్‌లో 44వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లి.. ఛేదనలో వేగవంతంగా 4వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ 124 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల పరుగుల (ఛేదనలో) ఈ మైలురాయిని అందుకుని భారత్ తరఫున అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి కేవలం 64 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకుని ఆ రికార్డ్‌ని కనుమరుగు చేశాడు. రికీ పాంటింగ్ ఈ మైలురాయిని 104 ఇన్నింగ్స్‌లో అందుకున్నా.. తాజాగా అది కూడా బద్దలైపోవడం విశేషం. అయితే.. ఛేదనలో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో మాత్రం సచిన్ 5490 పరుగులతో నెం.1గానే కొనసాగుతున్నాడు. అతని తర్వాత రికీ పాంటింగ్ 4186.. ప్రస్తుతం మూడో స్థానంలో కోహ్లి 4001 పరుగులతో

కొనసాగుతున్నాడు. శ్రీలంకతో పల్లెకలె వేదికగాభారత్ గురువారం రెండో వన్డే ఆడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news