విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా మీద సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ నెగటివ్ పబ్లిసిటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమా ప్రచారంలో భాగంగా లిప్ లాక్ పోస్టర్స్ బస్సుల మీద ఉంచగా అవి చించి ఇలాంటి సినిమాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయంటూ విహెచ్ వీరంగం ఆడాడు. ఇక సినిమా రిలీజ్ తర్వాత సంచలన విజయం దక్కించుకుంది.
ఏకంగా తెలంగాణా రాష్ట్ర ఐటి, పంచాయితి రాజ్ శాఖ మంత్రి కె.టి.ఆర్ సినిమా గురించి పొగుడుతూ ట్వీట్ చేశారు. ఇక మళ్లీ విహెచ్ అర్జున్ రెడ్డిపై విమర్శించాడు. కె.టి.ఆర్ కు హీరో దూరపు చుట్టం అంటూ కామెంట్ చేశాడు. ఇక విహెచ్ కామెంట్స్ కు మళ్లీ అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తన మార్క్ పంచ్ వేశాడు.
సినిమాను పొగిడిన వారి గురించి విహెచ్ ప్రస్థావించినట్టుగానే.. డియర్ తాతయ్య సినిమాను అభినందించారు కాబట్టి కె.టి.ఆర్ నా దూరపు బంధువు.. రానా, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా బ్రదర్స్, రాజమౌళి నా తండ్రి, ఇక ఎలాగు నాకు సిస్టర్స్ లేరు కాబట్టి సమంత, అను ఇమ్మాన్యుయెల్, మెహెరిన్ నా మరదళ్లు. ఇక రిలీజ్ అయిన నాటి నుండి 5000 ల షోస్ హౌజ్ ఫుల్ చేసిన వారంతా తన ట్విన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక ఆర్జివి నీకు ఫాదరో నాకు ఫాదరో క్లారిటీ రాలేదు.. అంటూ ఓ సుధీర్గమైన మెసేజ్ పెట్టాడు. సినిమా మైండ్ సెట్ మార్చే దిశగా వెళ్తున్నాం కాని కొందరు మాత్రం తొడగొట్టే కాలంలోనే ఉన్నారంటూ పంచ్ వేశాడు. ఇక చివరగా తాతయ్య చిల్ అని మళ్లీ విహెచ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు విజయ్. మరి ఈ కామెంట్స్ పై విహెచ్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది.