జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలీటీ షో ‘బిగ్‌బాస్’.. బంపర్ విక్టరీ కొట్టింది. తొలివారంలో అత్యధిక తెలుగు వ్యూయర్ షిప్ రికార్డ్ నెలకొల్పిన బిగ్ బాస్. రెండో వారం ఎండింగ్‌కి వచ్చేసరికి మొదటి వారం షో రేటింగ్ కంటే ఇప్పుడు నాలుగు రేట్లు పెరిగిపోయింది. రీసెంట్ వీక్ రిపోర్ట్ ప్రకారం ఐదున్నర లక్షల వ్యూయర్ ఇంప్రెషన్స్‌తో స్టార్ మా టాప్ తెలుగు ఛానల్‌గా నిలిచింది. ప్రేక్షకులు భారీ అంచనాలతో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్‌ను టీవీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 5.2 కోట్ల మంది వీక్షించారని అధికారిక ప్రకటన విడుదల చేసింది స్టార్ మా చానల్ రెండో వారానికి మరింత పుంజుకుందని తెలిపింది.
బిగ్‌బాస్ ప్రారంభం కాకముందు అంటే 28వ వారంలో జనరల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో 559 పాయింట్ల రేటింగ్‌లో ఉన్న మా చానల్ 29వ వారం వచ్చేసరికి అంటే బిగ్ బాస్‌షో ప్రారంభమైన తొలి తొలివారానికి 813 పాయిట్లు సాధించగా.. 30వ వారానికి (బిగ్ బాస్ సెకండ్ వీక్) 825 పాయిట్లకు చేరుకుంది. మొన్నటి ఆదివారం నాటి ‘బిగ్ బాస్’ ఎపిసోడ్ 12.7 టీఆర్పీతో వారంలో అత్యధిక రేటింగ్ దక్కించుకోగా.. ఈ షోకు వారం మొత్తంలో సగటున 12.1 టీఆర్పీ రావడం విశేషం. తొలివారంలో సరాసరి సగటు టీఆర్పీ రేటింగ్ 10.4 ఉండగా అది ఇప్పుడు 12.1కి చేరింది. ఇప్పటికే జీ ఈ సీ( జనరల్ ఎంటర్ టైన్ మెంట్) విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న స్టార్ మా ఛానెల్.. వరుసగా రెండో వారం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
ఇక బిగ్ బాస్ సీజన్1 మూడో వారంలో విషయానికి వస్తే… సింగర్ మధుప్రియ ఎలిమిమేట్ కావడం.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌కి గ్లామర్ లుక్ ఇచ్చేందుకు ఎంట్రీ ఇచ్చిన దీక్ష.. స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ప్రిన్స్ దీక్షకు అట్రాక్ట్ అవుతూ ఆమెకు ముద్దు పెట్టడంతో పాటు ధనరాజ్ భార్య హౌస్‌లో ఉన్న వాళ్లతో మాట్లాడటం లాంటివి ఈ వారంలో హైలైట్‌గా నిలిచాయి. మరి మూడో వారంలో బిగ్ బాస్ రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.