Newsనన్ను రేప్ చేస్తాం అంటున్నారు - లేడీ డైరెక్టర్ ఏడుపు !

నన్ను రేప్ చేస్తాం అంటున్నారు – లేడీ డైరెక్టర్ ఏడుపు !

తమిళనాడు కి చెందిన ఒక షార్ట్ ఫిలిం లేడీ డైరెక్టర్ కి చంపేస్తాం అనీ రేప్ చేస్తాం అనీ బెదిరింపులు వస్తున్నాయి. బీజేపీ తో పాటు ఇతర పార్టీల వాళ్ళు తనని చంపుతాం అని బెదిరుస్తున్నారు అనీ ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసారు. 2009 లో లా కాలేజీ స్టూడెంట్ సురేష్ అనే కుర్రాడు పాము కాటు తో చనిపోయాడు. అతని చావు తరవాత అతని కుటుంబం మొత్తం రోడ్డున పడింది. అతని కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలి అంటూ ఆమె మదురై ఆసుపత్రి ముందర పోరాటం చేస్తున్నారు .

ఈ కేసులో ఆమె ఇప్పటికే అరస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకి వచ్చారు. బయటకి వచ్చిన తరవాత రోజు మీడియా తో మాట్లాడిన ఆమె.. ” నేను ఇంటికి వచ్చీ రాగానే నా ఫోన్ కి సీరియస్ మెసేజ్ లూ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం అని కొందరూ రేప్ చేస్తాం అని కొందరూ వార్నింగ్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియా లో కూడా ఇలాంటి మెసేజ్ లు వస్తున్నాయి. ” తాను తీసిన కక్కూస్ అనే షార్ట్ ఫిలిం ని తప్పుగా అర్ధం చేసుకున్నారు అని ఆమె మీడియాతో చెప్పారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news