Newsభార్యతో బలవంతపు శృంగారం... రేప్ కాదా...?

భార్యతో బలవంతపు శృంగారం… రేప్ కాదా…?

అంతర్జాతీయంగా ‘మ్యారిటల్ రేప్’ అనే మాటకు ఉన్న నిర్వచనం వేరే. ఇండియాలో మాత్రం ఈ పదానికే అర్థం లేదు. తాజాగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ విషయంలో స్పష్టతను ఇచ్చింది. భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొంటే.. అది నేరం కాదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది వరకూ భారత పార్లమెంటులో ఇందుకు సంబంధించి జరిగిన చర్చను కూడా ధర్మాసనం ప్రస్తావించింది.

ఎలాంటి పరిస్థితుల్లో అయినా భార్యతో భర్త చేసే శృంగారాన్ని రేప్ గా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.వివాహం తర్వాత సెక్స్ విషయంలో వయసు నిబంధనలకు కూడా కోర్టు పరిమితులను ఇవ్వకపోవడం గమనార్హం. మామూలుగా అయితే 18 యేళ్ల వయసులోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. అయితే ఒకవేళ ఆ లోపే వివాహం జరిగిపోయి ఉంటే, 15 నుంచి 18 యేళ్ల వయసులోపు భార్యతో ఆమె సమ్మతం లేకుండా సెక్స్ లో పాల్గొన్నా అది రేప్ కాదని సుప్రీం స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం తీర్పును వెలువరించింది.అంతర్జాతీయంగా ‘మ్యారిటల్ రేప్’ కూడా చట్టబద్ధంగా నేరమే.

చాలా దేశాల్లో దీనికి శిక్ష కూడా ఉంది. సహజీవనంలోనైనా, పెళ్లి చేసుకున్న తర్వాత అయినా భార్య సమ్మతి లేకుండా సెక్స్ లో పాల్గొనడం, ఆమెను బలవంతం చేయడం నేరమే. ఇది వరకూ మ్యారిటల్ రేప్ ను నేరంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి అన్ని దేశాల ప్రభుత్వాలకూ సూచన చేసింది. అయితే ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దానికి సమ్మతించలేదు. భారత్ లోని సామాజిక పరిస్థితుల రీత్యా మ్యారిటల్ రేప్‌ అనే మాటకు విలువ లేదని, శిక్షాస్మృతిలో దాన్ని నేరంగా పరిగణించలేమని భారత ప్రభుత్వం పార్లమెంటులో ఇది వరకే ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news