Moviesస్పైడర్ సంచలనాలు మొదలైనట్టే.. భూం భూం సాంగ్ తో సర్ ప్రైజ్...

స్పైడర్ సంచలనాలు మొదలైనట్టే.. భూం భూం సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీ రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్ది అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. కేవలం ఒక్క టీజర్ మాత్రమే రిలీజ్ చేసి ఇన్నాళ్లు మహేష్ అభిమానుల సహనాన్ని పరిక్షించిన మురుగదాస్, ఈరోజు ఆ సినిమాలోని ఓ సాంగ్ రిలీజ్ తో ఫ్యాన్స్ కు గిఫ్ట్ అందించాడు. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని భూం భూం సాంగ్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. టైటిల్ మాత్రమే కాదు అందులోని సాంగ్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.

ఇక మహేష్ అల్ట్రా మోడ్రెన్ లుక్ గురించి చెప్పడానికి మాటల్లేవు. అసలే అందగాడైన మహేష్ మరింత వన్నె తెచ్చేలా తన కాస్టూమ్స్, వెనుక బ్యాక్ గ్రౌండ్ కలర్ అంతా సూపర్బ్ అని చెప్పాలి. దసరా బరిలో సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ స్పైడర్ టాలీవుడ్ లో ఓ సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందని అంటున్నారు. సాంగ్ టీజర్ తో మొదలైన ఈ సంచలనాలు సినిమా రిలీజ్ తర్వాత కూడా కొనసాగేలా ఉన్నాయి.

Latest news