దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రీ రిలీజ్ బిజినెస్ లో భారీ మొత్తాన్ని పలికినట్టుగా తెలుస్తోంది. ‘బాహుబలి-2’ తర్వాత రానా నటించిన సినిమాగా ఇది విడుదల అవుతోంది. రానా సోలో హీరోగా ఈ సినిమాతో లక్ ను పరీక్షించుకుంటున్నాడు. ప్రత్యేకించి బాహుబలి-2 తర్వాత వస్తున్నది కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ భారీ స్థాయిని రీచ్ అయ్యిందని సమాచారం.
బాహుబలి వన్ అండ్ టూ లతో రానా తెలుగునాటే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి అలా దక్కిన గుర్తింపుతో రానా తాజా సినిమా రికార్డు స్థాయి వ్యాపారాన్ని చేసిందని సమాచారం. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తమిళ, మలయాళ, హిందీ అనువాద హక్కులు, ఆ భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్.. ఇలా ఈ వ్యాపారం అంతా కలిసి 25 కోట్ల మార్కును రీచ్ అయినట్టు సమాచారం.
తెలుగుతో సంబంధం లేకుండానే ఈ సినిమా పాతిక కోట్ల వ్యాపారాన్ని చేసినట్టుగా తెలుస్తోంది.ఈ సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్టే ఇరవై కోట్ల రూపాయల లోపు! తెలుగుతో సంబంధం లేకుండానే ఈ సినిమా పాతిక కోట్ల వ్యాపారాన్ని చేసింది. ఇక తెలుగు మార్కెట్ విషయానికి వస్తే.. శాటిలైట్ రైట్సే భారీ మొత్తాన్ని పలికినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా విడుదల కాకుండానే ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయి లాభాలను పండించినట్టుగా తెలుస్తోంది. సినిమా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఖుషీ అయ్యే అవకాశాలున్నాయి