ధృవ తర్వాత కెరియర్ మీద పూర్తి జాగ్రత్త తీసుకుంటున్న రాం చరణ్ సినిమాలను కూడా ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం మూవీ చేస్తున్న చరణ్ ఆ తర్వాత సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇక ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం చరణ్ తో దిల్ రాజు ఓ మెగా సినిమాకే స్కెచ్ వేశాడని తెలుస్తుంది.
శతమానం భవతితో సూపర్ హిట్ మాత్రమే కాదు ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డ్ కూడా అందుకునేలా చేసిన దర్శకుడు సతీష్ వేగేశ్న ఈసారి శ్రీనివాస కళ్యాణం తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ దిల్ రాజు బ్యానర్లో రిజిస్టర్ చేయించారు. సినిమాలో హీరోగా చరణ్ ను ఒప్పించే పనుల్లో ఉన్నాడట దిల్ రాజు.
అసలైతే ఈ సినిమా కోసం మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ను అడిగారని టాక్. మరి తేజు ఏమన్నాడో ఏమో కాని శ్రీనివాస కళ్యాణం సినిమా చెర్రితోనే చేయాలని పట్టుబడుతున్నాడట దిల్ రాజు. మరి దిల్ రాజు చరణ్ ను ఒప్పించి ఈ సినిమా తనతోనే చేస్తాడా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.