Moviesరాజు గారి గది-2 మోషన్ పోస్టర్..నాగార్జున బర్త్ డే స్పెషల్..!

రాజు గారి గది-2 మోషన్ పోస్టర్..నాగార్జున బర్త్ డే స్పెషల్..!

ఓంకార్ డైరక్షన్ లో రాజు గారి గది సీక్వల్ గా వస్తున్న సినిమా రాజు గాది గది-2. అక్కినేని నాగార్జున లీడ్ రోల్ లో చేస్తున్న ఈ సినిమాలో అశ్విన్, సీరత్ కపూర్ జంటగా నటిస్తున్నారు. సమంత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈరోజు నాగార్జున బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. రుద్రాక్షలు చేతిలో పట్టుకుని నాగార్జున పోస్టర్ రిలీజ్ చేశారు ఇక ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది.

చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ సినిమాల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఆ సూపర్ సినిమాకు పార్ట్ 2గా నాగార్జున, సమంత లాంటి స్టార్ కాస్టింగ్ తో రాబోతుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ తోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఇచ్చాడు. సెప్టెంబర్ 20న సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తుండగా మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

DIYgm3yUEAAVRPE.jpg_large

DIYfHOnUIAIVRHl.jpg_large

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news