బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయం మీదే టాలీవుడ్ లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఎవరికి వారు ఊహాగానాలు అల్లేస్తుంటే ఫైనల్ గా మాత్రం ఓ ఇద్దరు హీరోలతో సినిమా ఉంటుందని అంటున్నారు. రాజమౌళితో ఎన్నాళ్ల నుండో సినిమా చేయాలని చూస్తున్న మహేష్ అతనితో సినిమా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆల్రెడీ కె.ఎల్ నారాయణ ఈ ఇద్దరి కాంబినేషన్ కు అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉన్నాడు.
ఇక మహేష్ కాకుంటే మరోసారి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో రాజమౌళి సినిమా ఉంటుందని టాక్. ఎన్.టి.ఆర్ తో రాజమౌళి సినిమా అంటే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. బాహుబలి తర్వాత ఓ మినిమం బడ్జెట్ సినిమా చేస్తాడేమో అన్న వార్తలకు షాక్ ఇస్తూ మహేష్ తో చేసినా ఎన్.టి.ఆర్ తో చేసినా మళ్లీ భారీ బడ్జెట్ మూవీనే ఉంటుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా ఉంటారని తెలుస్తుంది.