బిగ్ బాస్ షో నుండి మొదట బయటకు వచ్చిన హౌజ్ మెట్ జ్యోతి. పెళ్లాం ఊరెళితే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఆమె అలాంటి పాత్రలనే చేసుకుంటూ వస్తుంది. ఈమధ్య నెగటివ్ రోల్స్ కూడా చేస్తున్న జ్యోతి బిగ్ బాస్ నుండి మొదట రావడం వల్ల అందరు విమర్శించారు. అయితే అందరు విమర్శలు చేసినా సరే ఆ బిగ్ బాస్ నుండి తను అందుకున్న మొత్తంలో కొంతభాగం సేవా కార్యక్రమాలు చేస్తుంది జ్యోతి.ఈమధ్యనే క్యాన్సర్ తో బాధపడుతున్న అల్లరి ఫేమ్ సుభాషిణి గురించి అందరం వార్తల్లో విన్నాం. అయితే ఆమె కోసం 50 వేల రూపాయలు డొనేట్ చేసిందట జ్యోతి.
అంతేకాదు వచ్చిన మొత్తంలో ఇంకా కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని అనుకుంటుందట. జ్యోతి చూసేందుకు కాస్త బోల్డ్ గా కనిపిస్తుంది కాని ఆమె మనసు మాత్రం చాలా గొప్పదని ఈ సందర్భంలో వెళ్లడైంది. పెళ్లై ఓ కొడుకు పుట్టాక తన భర్త తనని వదిలేసి వెళ్లినా సరే అతన్నే చూసుకుంటూ జీవనం సాగిస్తుంది జ్యోతి. బిగ్ బాస్ హౌజ్ లో కూడా కాస్త ఇబ్బంది పడ్డ జ్యోతి మొత్తానికి దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని సుభాషిణికి సహాయం చేయడం అందరిని షాక్ అయ్యేలా చేసింది.