Reviewsజయ జానకి నాయక రివ్యూ

జయ జానకి నాయక రివ్యూ

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. జగపతిబాబు.. ప్రగ్యా జైస్వాల్‌.. శరత్‌కుమార్‌.. వాణీ విశ్వనాథ్‌, నందూ, కేథరిన్ తదితరులు
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్‌
ప్రొడ్యూసర్: మిర్యాల రవీందర్‌రెడ్డి
స్టోరీ-డైరెక్షన్ : బోయపాటి శ్రీను
టాలీవూడ్ లో బోయపాటి శ్రీను అంటే మాస్ డైరెక్టర్. మాస్ సినిమాలు తీయడోలో ఆయనకు ఆయనే సాటి. సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి… బెల్లకొండ సాయి శ్రీనివాస్ తో జయజానకీ నాయక అంటూ సాఫ్ట్ టైటిల్ తో సినిమా తీశాడు. పవర్ ఫుల్ సినిమాలతో మన ముందుకు వచ్చిన బోయపాటి.. సాఫ్ట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాను ఎలా మలిచాడు. ఫ్లాపుల్లో ఉన్న సాయి శ్రీనివాస్ కు హిట్ ఇచ్చాడా..?

స్టోరీ: గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)కు ఫ్యామిలీ అంటే ప్రాణం. కుటుంబం కోసం ఏమైనా చేస్తాడు. తండ్రి చక్రవర్తి (శరత్‌కుమార్‌) అన్నయ్య(నందు)లంటే అత‌నికి ప్రాణం. గగన్‌కు స్వీటి(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. స్వీటీ రావడంతో చక్రవర్తి ఇంట్లో ఎప్పుడూ లేని ఆనందం నెలకొంటుంది. ఈ క్రమంలో స్వీటి-గగన్‌ లవ్ లో పడతారు. ఐతే స్వీటీ లైఫ్ అనుకోని మలుపు తిరుగతుంది. అప్పటివరకూ సంతోషంగా ఉన్న స్వీటీ ఒక్కసారిగా కష్టాల్లో పడుతుంది. ఆమెను రక్షించడానికి గగన్ ఏం చేశాడు. 0అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ, స్వీటికి ఉన్న రిలేషన్ ఏంటి? అనేదే మిగితా స్టోరీ
ఎలా ఉంది?: ఇది మాస్ టచ్ ఇచ్చిన లవ్ స్టోరీ. సినిమాలో లవ్ ట్రాక్ కంటే మాస్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు? ఎవరిపై పోరాటం చేశాడు? ఆ కథ చుట్టూనే యాక్షన్‌ ఎమోషన్‌ సీన్స్ ను అల్లేశాడు బోయపాటి శ్రీను. తనకున్న ప్రధాన బలమైన యాక్షన్ కు స్క్రీన్ పై చక్కగా ఎలివేట్ చేశాడు. సినిమా ఓపెనింగ్ షాట్ నుంచే ఎమోషన్స్ తో నింపేశాడు. లవ్ సీన్స్ కంటే యాక్షన్ సీక్వెన్స్
పరువుకి పంతానికి మధ్యలో ఓ అమ్మాయి ఎలా నిలిగిపోయిందో చక్కగా చూపించాడు. హంసలదీవిలో తెరకెక్కించిన యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుంది. శరత్‌కుమార్‌ ఉన్న సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ అవుతాయి. లవ్ స్టోరీ అయినా.. యాక్షన్‌ సన్నివేశాలతో తెరపై అధిక భాగం ఫైట్లకే పరిమితం చేసినా, దాని చుట్టూ ఎమోషన్‌ సన్నివేశాలు ప్రేక్షకుడిని కదలకుండా చేస్తాయి.

ఎలా చేశారు?: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఇది మూడో సినిమా యాక్షన్‌, డాన్స్ సీక్వెన్స్ బాగా చేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డైలాగ్‌లు ఫర్వాలేదనిపించాడు. రెండు కోణాల్లో సాగిన పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఒదిగిపోయింది. జగపతిబాబు మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఆయన వచ్చే ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నందూకి కూడా మంచి పాత్రే దక్కింది. శరత్‌కుమార్‌ నటన, ఆయన చుట్టూ నడిపించిన సన్నివేశాలు అలరిస్తాయి.
సాంకేతికంగా..: ,సినిమాను డైరెక్టర్ లావిష్ గా తెరకెక్కించారు. చిన్న పాత్రలో కూడా ప్రముఖ నటులే కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కెమేరా పనితనం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. . కేథరిన్‌ ఐటమ్‌ సాంగ్‌ లో మెరిసింది. బలాలు
+ ఫైట్లు
+ సాంకేతికవర్గ పనితీరు
+ భారీతనం
బలహీనతలు
– వినోదం లేకపోవడం
– మితిమీరిన యాక్షన్‌ సన్నివేశాలు

రేటింగ్ : 3/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news