భారత దేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా హెలీ ట్యాక్సీ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. బెంగళూర్ నగరంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలీ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి..ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అభివృద్ది చెందిన దేశాల్లో ఇప్పటికే హెలీ ట్యాక్సీ సేవలు అమలులో ఉన్నాయి. అయితే మన దేశంలో మాత్రం నేడు ప్రారంభయ్యాయి. బెంగళూర్ నగరంలో మొట్టమొదటి సారిగా ప్రారంభమ్యాయి. రెండు రకాల హెలీ ట్యాక్సీలు ప్రారంభమయ్యాయి. ఒక హెలీకాప్టర్లో ఐదుగురు, మరో హెలీకాప్టర్లో 13 మంది ప్రయాణించవచ్చు.
ప్రస్తుతం రెండు హెలీ ట్యాక్సీలను ప్రవేశపెట్టారు. మరో వారంలో మూడు హెలీ ట్యాక్సీలను తీసుకురానున్నారు. అదేవిధంగా ప్రయాణికుల డిమాండ్ మేరకు హెలికాప్టర్ల సంఖ్య పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి తెలియనిది కాదు, అక్కడ 5 కిలో మీటర్లు ప్రయాణించాలంటే గంటకు పైగా సమయం తీసుకుంటుంది. బెంగళూర్ లో ప్రముఖ ఐటి నిపుణులు రోజు వారిగా ప్రయాణిస్తారు. వారి సమయం ట్రాఫిక్ లోనే గడిచిపోతుందిని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెలీ ట్యాక్సీలను ఎలక్ట్రానిక్ సిటీ తో పాటు పలు ప్రాంతాలకు రెండు హెలీ ట్యాక్సీల ద్వారా సేవలు అందజేయనున్నారు.