Gossipsపవన్ కు ఆయన అందుకే దూరమయ్యాడా ..? ఇలా కూడా వదిలి...

పవన్ కు ఆయన అందుకే దూరమయ్యాడా ..? ఇలా కూడా వదిలి వెళ్తాడా.. ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం చూపే సిని జనాలు చాలా మందే ఉంటారు. అయితే పవన్ తో కొన్నాళ్లుగా ప్రయాణం సాగించినా సడెన్ గా పవన్ ఫ్రెండ్ షిప్ కు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదెలా అనుకుంటారు కదా ప్రస్తుతం పవన్ నిర్మాత శరత్ మరార్ పరిస్థితి అలానే ఉందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎన్నో ఏళ్లుగా మంచి రిలేషన్ ఉన్న శరత్ మరార్ పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలను నిర్మించాడు.

అన్ లక్కీగా ఆ రెండు సినిమాలు విఫలమయ్యాయి. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్స్ గొడవలో ఇవ్వాల్సిన డబ్బులు ముక్కుపిండి ఇప్పించాడట పవన్. పోని కాటమరాయుడి అయినా హిట్ అవుతుంది అనుకుంటే ఇది కూడా అదే రిజల్ట్ ఇచ్చింది. అందుకే శరత్ మరార్ పవన్ కు దూరంగా వెళ్లాడట.

అసలైతే పవన్ ఎక్కడకెళ్లినా తనతో వచ్చే శరత్ మరార్ ఈమధ్య మొహం చాటేస్తున్నాడు. పవన్ తో దాదాపు ఫ్రెండ్ షిప్ కటీఫ్ అన్న సందేహాలు మొదలయ్యాయి. మరి పవన్ తో ఇన్నేళ్లు స్నేహం చేసిన శరత్ అంత త్వరగా పవన్ ను వదిలి వెళ్తాడా అన్నది తెలియాల్సిన వాస్తవం. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ సినిమా తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేస్తున్న శరత్ మరార్ తెలుగులో మీడియం బడ్జెట్ సినిమాలు తీయాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే దానికి సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఇస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news