Moviesఅగ్రికల్చర్ బిఎస్సీ చేస్తున్న మలయాళ భామ.. చదువుకుంటూనే రెండు హిట్లు కొట్టింది..!

అగ్రికల్చర్ బిఎస్సీ చేస్తున్న మలయాళ భామ.. చదువుకుంటూనే రెండు హిట్లు కొట్టింది..!

మలయాళ భామలకు తెలుగులో మంచి గిరాకి ఉందని తెలిసిందే. వారి నటనతో ఇక్కడ సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్న వారు ఓ పక్క సినిమాలతో పాటు చదువుల్లో కూడా రాణించేస్తున్నారు. సినిమా ఛాన్స్ వస్తే ఇక కెరియర్ సెటిల్డ్ అనుకునే ఈరోజుల్లో మలయాళ భామలు మాత్రం ఓ పక్క సినిమాలతో అలరిస్తూనే మరో పక్క చదువుల్లో రాణిస్తూ తమ కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఫిదాతో హిట్ అందుకున్న సాయి పల్లవి మెడిసిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదే దారిలో జెంటిల్మన్, నిన్ను కోరి సినిమాలతో హిట్ అందుకున్న నివేథా థామస్ కూడా అగ్రికల్చర్ బిఎస్సి చదువుతుందట.

ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చేస్తున్న అమ్మడు ఒక్క రోజు కూడా కాలేజ్ బంక్ కొట్టలేదట. తనకు వచ్చిన ఛాన్సులను కూడా కేవలం హాలిడేస్ లో పూర్తి చేసేదట. చదువుకి ప్రాముఖ్యత ఇస్తున్న నివేథా, సాయి పల్లవిలను చూసి ఈ తరం స్టూడెంట్స్ చాలా నేర్చుకోవాలని చెప్పాలి. ప్రేక్షకుల్లో ఓ పాపులారిటీ వచ్చాక కూడా ఇలా చదువు కోసం తాపత్రయ పడటం చూస్తుంటే కచ్చితంగా వీరు లైఫ్ లో పెద్ద పొజిషన్ కే వెళ్తారని అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news