దిల్ రాజు బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేసిన హరిష్ శంకర్ మరోసారి అదే బ్యానర్లో సినిమాకు సిద్ధమయ్యాడు. రీసెంట్ గా దువ్వాడ జగన్నాధం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిష్ శంకర్ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇక తన తర్వాత సినిమా ఓ మల్టీస్టారర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
దిల్ రాజు బ్యానర్లో నాని, శర్వానంద్ హీరోగా హరిష్ శంకర్ డైరక్షన్ లో ఈ సినిమా ఉండబోతుందట. ఒకవేళ నాని, శర్వానంద్ తో సెట్ అవ్వకపోతే సాయి ధరం తేజ్, వరుణ్ సందేశ్ అయినా కుదిరే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సడెన్ గా ఈ మల్టీస్టారర్ థాట్ ఎలా వచ్చిందో ఏమో కాని దిల్ రాజు మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్త్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
సినిమాకు టైటిల్ గా దాగుడు మూతలు అని రిజిస్టర్ చేయించారట. టైటిల్ చూస్తే ఇదో కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాపై పూర్తి వివరాలు ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో చూడాలి.