దర్శకులలో బోయపాటి స్టైల్ వేరని చెప్పాలి. తమ అభిమాన హీరోని ఎలా చూపించాలో ఆడియెన్స్ అంచనాలకు మించి స్టార్స్ ను పవర్ ఫుల్ గా చూపిస్తాడు బోయపాటి. బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జయ జానకి నాయకా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ నెల 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా రిలీజ్ పట్ల పెద్ద సంక్షోభం వీడింది. లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాలకు పోటీగా వద్దని జయ జానకి నాయకా సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేయాలని అనుకున్నారు. ఒకవేళ పోస్ట్ పోన్ అవకున్నా ఓ రోజు ముందైనా సరే ఆ సినిమా తీసుకు రావాలని చూశాడు.
కాని ఈ రెండిటికి బోయపాటి ససేమీరా అన్నట్టు టాక్.
పోటీ నుండి తప్పుకుంటే భయపడినట్టు అవుతుందని.. లేదా ప్రీ పోన్ చేసినా ప్రీమియర్ షోస్ వల్ల ఇబ్బంది అవుతుందని అనుకున్న డేట్ కే యధాతధంగా రిలీజ్ చేయాలని కోరాడట. చేసేదేం లేక సరే అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బోయపాటి ఇలా తన పంతం నెగ్గించుకున్నాడని గుస గుసలాడుతున్నారు.