Newsబిగ్ బాస్ హౌజ్ ను మళ్ళీ మురిపించిన తారక్.. నవ్వుల పువ్వులు...

బిగ్ బాస్ హౌజ్ ను మళ్ళీ మురిపించిన తారక్.. నవ్వుల పువ్వులు .. జీవిత లక్ష్యాలు

బిగ్ బాస్ హౌజ్ నుండి ఎట్టకేలకు ధన్ రాజ్ బయటకు వచ్చేశాడు. ఈవారం నామినేషన్ లో శివ బాలాజి, ధన్ రాజ్, అర్చన, కార్తిక ఉండగా వారిలో ధన్ రాజ్ ను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు ఎన్.టి.ఆర్. ఇక శనివారం వచ్చిందంటే ఎన్.టి.ఆర్ ప్రత్యక్షమవ్వాల్సిందే కాబట్టి తన జోష్ ఫుల్ యాంకరింగ్ తో అలరించాడు ఎన్.టి.ఆర్.

ఓ స్టార్ అయ్యుండి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యేలా చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఎన్.టి.ఆర్ టాలెంట్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ శనివారం ఎపిసోడ్ లో హౌజ్ మెట్స్ లో మెమరబుల్ మూమెంట్, వరస్ట్ మూమెంట్ అడిగి తెలుసుకున్న తారక్ హౌజ్ మెట్స్ యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నాడు.

మెక్కుడు తొక్కుడు కాన్సెప్ట్ కూడా హౌజ్ మెట్స్ ను ఎంటర్టైన్ చేసింది. అన్నిటికి మించి ధన్ రాజ్ ఎలిమినేషన్ హైలెట్ గా నిలిచింది. ముమైత్ రీ ఎంట్రీతో ధన్ రాజ్ మీద పగ తీర్చుకుంటున్న సంగతి తెలిసిందే. మానిపులేషన్ అంటూ ధన్ రాజ్ మనసు బాధపడేలా చేసిన ముమైత్ ధన్ రాజ్ ఎలిమినేషన్ కు ప్రధాన కారణం అయ్యింది. ఇక ఈ వారం మరో ఎలిమినేషన్ కూడా ఉంటుందని అన్నాడు తారక్.. సేఫ్ జోన్ లోకి వెళ్ళిన శివ బాలాజిని వదిలితే ఇంకా నామినేషన్ లో ఉన్న అర్చన, కార్తికలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆదివారం ఎపిసోడ్ లో చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news