కోలీవుడ్ లో బిగ్ బాస్ లో మరో ప్రకంపన. ఇంతకు ముందే పలు సంస్థల నుంచి వ్యతిరేకతతో పాటు, కేసులను కూడా ఎదుర్కొంటున్న ఈ షోకు మరో షాక్ ఇచ్చింది మద్రాస్ హై కోర్ట్. కోలీవుడ్ బిగ్ బాస్ షోలో తమిళ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారని వేసిన కేసులో కమల్ హాసన్ తో పాటు ఈ షో ని ప్రసారం చేస్తున్న విజయ్ టీవీకి కోర్టు నోటీసులు జారీ చేసి షాకిచ్చింది.
బిగ్ బాస్ షోలో భాగంగా పార్టిసిపెంట్ అయిన కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్.. మరో పార్టిసిపెంట్ ను అలగాజనంలో బ్రతికే ప్రవర్తన (మురికివాడలో ఉండే వ్యక్తి) అని తిట్టడంపై అభ్యంతరాలు రావడం తో…. వారం రోజుల్లోగా గాయత్రి రఘురామ్ తో పాటు కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కోరినా.. వారి దగ్గరనుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఆ తరుణంలో కోర్టు కమల్ హాసన్ తో పాటు వివాదానికి కారణమైన గాయత్రి రఘురామ్,అలాగే కార్యక్రమ నిర్వాహకులు దీపక్ ధర్ స్టార్ విజయ్ టీవీ జనరల్ మేనేజర్ అజయ్ విద్యా సాగర్ లకు నోటీసులు జారి చేసింది.