Moviesఅర్జున్ రెడ్డి డైరక్టర్ ఆ హీరోతో సినిమా..!

అర్జున్ రెడ్డి డైరక్టర్ ఆ హీరోతో సినిమా..!

సినిమాను ఇలా కూడా తీసి హిట్ కొట్టొచ్చు అని చెప్పి మరి విజయం సాధించిన దర్శకుడు సందీప్ రెడ్డి. ఆయన తీసిన అర్జున్ రెడ్డి మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా కలక్షన్స్ హంగామాతో హడావిడి చేస్తుంది. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి అప్పుడే తన సెకండ్ మూవీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

అర్జున్ రెడ్డి సినిమా మిస్ అయిన శర్వానంద్ తోనే సందీప్ రెడ్డి తన రెండవ సినిమా చేయబోతున్నాడట. అర్జున్ రెడ్డి హిట్ అవ్వడం చూసి శర్వా ఓ హిట్ సినిమా మిస్ అయ్యానన్న బాధ ఉండే ఉంటుంది. ఏదైతేనేం మొదటి సినిమా మిస్ అయినా రెండవ సినిమాకు ఆ ఛాన్స్ దొరికేసింది. దర్శకుడిగా తన సినిమా మీద ఉన్న నమ్మకాన్ని ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినా సరే నిలబడి మరి గెలిచి చూపించాడు సందీప్ రెడ్డి.

మొదటి సినిమా అంచనాలకు మించి సక్సెస్ చేసుకున్న ఈ దర్శకుడు రెండో సినిమా ఎలాంటి కిక్ ఇస్తాడో చూడాలి. ఇక శర్వానంద్ విషయానికొస్తే ఈ ఇయర్ శతమానం భవతి హిట్ అందుకోగా రాధ మళ్లీ వెనుకడుగు వేసేలా చేసింది. ఇక దసరా బరిలో మహానుభావుడుగా రాబోతున్న శర్వానంద్ ఆ సినిమా మీదే అంచనాలు పెట్టుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news