ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరో క్యారక్టర్ కాస్త బోల్డ్ గా ఉంటుంది. అయితే సినిమాను సెలబ్రిటీస్ అంతా పొగుడుతుండగా అనసూయ మాత్రం ఆ సినిమా మీద రుసరుసలాడుతుంది. హీరో విజయ్ ఈ సినిమాలో లానే బయట యువత ఉండాలని సలహా ఇవ్వడం నచ్చట్లేదని అంటుంది.
అంతేకాదు అమ్మ మీద వచ్చే బూతు పదం తనని బాగా హర్ట్ చేసిందని అంటుంది అనసూయ. మీ ఇంట్లో ఆడవాళ్లని ఎవరినైనా అవమానిస్తే ఇలా వాళ్ల తల్లులను తిట్టమని చెబుతావా అంటూ విజయ్ దేవరకొండను నిలదీస్తుంది అనసూయ. నువ్వు ఇంకా ఎదగాలి విజయ్ అంటూ అన్న అనసూయ సినిమా తాను చూడలేదని.. సినిమా చూస్తే థియేటర్ లో ఎలాంటి భూతులు వినాల్సి వస్తుందో అని కంగారు పడుతుందట.
ఇదంతా బాగానే ఉంది కాని అమ్మడు బుల్లితెర మీద చేస్తున్న జబర్దస్త్ షోలో ఇంతకన్నా శృతిమించిన అడల్ట్ కంటెంట్ జోక్స్ పేలుతుంటాయి. వాటి గురించి నోరు మెదపడం చేతకాని అనసూయ అది మాత్రం కామెడీ కిందకు వదిలేసి ఓ హిట్ అయిన సినిమాను టార్గెట్ చేయడం ఏంటని అందరు చర్చించుకుంటున్నారు. మరి అనసూయకు విజయ్ అదే రేంజ్ రెస్పాన్స్ ఇస్తాడని ఆశిస్తున్నారు. మరి అది ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది చూడాలి.