ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించి భారీ వసూళ్లను సాధించడం హారర్ సినిమాల ప్రత్యేకత. ఇక హాలీవుడ్‌లో హారర్ చిత్రాల బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. ప్రతియేటా హాలీవుడ్‌లో పలు ఫ్రాంచైజీలు ప్రత్యేకించి సీక్వెల్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కాంజురింగ్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లను సాధిస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.ఈ సిరీస్‌లో భాగంగా తాజాగా విడుదలైన ‘అనబెల్లే3’ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఉన్న హారర్ సినిమాల రికార్డులను తిరగరాస్తూ దాదాపు 2,224 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇవి కేవలం ఓపెనింగ్ వీకెండ్ వసూళ్లు మాత్రమే. ఇప్పటికీ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.
ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడం, భయపెట్టడం ద్వారా ఈ చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. ఇక ఇదే సిరీస్‌లో 1999 లో విడుదలైన ‘ది సిక్స్త్ సెన్స్’ సూపర్ నేచురల్ హారర్ త్రిల్లర్ టాప్ గ్రాసర్‌గా నిలిచింది. 1973లో రిలీజైన ‘ది ఎగ్జార్సిస్ట్’, 2013లో రిలీజైన ‘కాంజురింగ్’, 2016లో రిలీజైన ‘కాంజురింగ్ 2’ చిత్రాలు టాప్ 10లో ఉన్న హారర్ చిత్రాలుగా రికార్డ్స్ నెలకొల్పాయి.