యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మా నిర్వహిస్తున్న కార్యక్రమం బిగ్ బాస్. హిందిలో సూపర్ సక్సెస్ అయిన ఈ రియాలిటీ షోని తెలుగులో కూడా మొదలుపెట్టారు. 14 మంది కంటెస్టంట్స్ తో మొదలైన ఈ బిగ్ బాస్ ఎన్.టి.ఆర్ హుశారైన హోస్టింగ్ తో సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇక ఈ ప్రోగ్రాం లో కంటికి కనిపించకుండా కేవలం కెమెరాతోనే మాట్లాడే బిగ్ బాస్ ఎవరు.. అతనికి వాయిస్ ఓవర్ చెబుతున్నది ఎవరు అని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.
బిగ్ బాస్ గా బేస్ వాయిస్ తో హౌజ్ మెట్స్ కు ఆంక్షలు విధిస్తున్న బిగ్ బాస్ తెలుగు వాయిస్ ఇస్తుంది ఎవరో కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ. హింది బిగ్ బాస్ కు అతుల్ కపూర్ వాయిస్ ఇవ్వగా తెలుగులో ఆ అవకాశం సీరియల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణకు దక్కిందట. ఈ వాయిస్ మ్యాచ్ అవడం కోసం చాలా మంది వాయిస్ టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక స్టార్ మాలో హింది డబ్బింగ్ సీరియల్ చెబుతున్న శంకర్ కూడా అప్పుడప్పుడు వాయిస్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కంటికి కనిపించకుండా తన గంభీరమైన మాటలతో భయపెట్టే బిగ్ బాస్ అసలు వాయిస్ ప్రధాతలు ఎవరు అన్నది తెలిసింది. వారం గడిచిన తర్వాత షో మీద ఆడియెన్స్ లో కూడా ప్రత్యేక ఆసక్తి మొదలైందని చెప్పొచ్చు. మొదటి ఎలిమినేటర్ జ్యోతి హౌజ్ నుండి బయటకు రావడం, ఆ తర్వాత ఆమె మీద ఎవరెవరు అభియోగాలు చేసారో వాటికి తారక్ వివరణ కోరడం లాంటివి ప్రోగ్రాం పై ఆడియెన్స్ ఆసక్తి కలిగించేలా చేశారు.