కార్పోరేట్ సంస్థలు ప్రొడక్షన్ హౌజ్ లుగా వచ్చి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేస్తే అది ఆడియెన్స్ కు థ్రిల్ ఎంత ఇస్తాయో తెలిసిందే. అయితే వీటి కోసం రిస్క్ చేసేందుకు ఆ సంస్థలు వెనుకాడవు. ఈ క్రమంలో హిందిలో బిగ్ బాస్ రియాలిటీ షోతో యావత్ దేశాన్ని ఓ సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఆ షో తెలుగులో కూడా వస్తుంది. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో 14 మంది కంటెస్టంట్స్ పాటిస్పేట్ చేశారు.
కార్పోరేట్ సంస్థలు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో పర్ఫెక్ట్ ఉంటారు. ఈ క్రమంలో వాటిని ఎవరు ఒబే చేసినా సరే క్షమించరు. బిగ్ బాస్ హౌజ్ నుండి బాస్ అనుమతి లేకుండా బయటకు రావడం అసంభవం. బయటకు వచ్చేందుకు ఒకే ఒక్క మార్గం అది ఎలిమినేట్ అయితేనే. అయితే రీసెంట్ గా జ్యోతి వెళ్లిపోగా మిగిలిన 13 కంటెస్టంట్స్ లో సంపూర్నేష్ బాగా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడు.
క్లాస్ట్రోఫోబియా అంటూ బయటకు పంపించకపోతే సూసైడ్ చేసుకుంటా అని కూడా నానా రచ్చ చేశాడు. ఇక బిగ్ బాస్ సంపూర్నేష్ ను పిలిచి వివరణ అడిగినా తనకు వెళ్లాలని ఉందని చెప్పేశాడు. ఇలా షోనుండి వెళ్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పినా మాట వినకుండా ముందు ఇక్కడ నుండి బయట పడేయండి అన్నాడు. అనుకున్నట్టుగానే బిగ్ బాస్ నుండి అర్ధాంతరంగా వెళ్లినందుకు సంపూర్నేష్ కు 16 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించారట. చేసుకున్న అగ్రిమెంట్ తనకు తానుగా బ్రేక్ చేసిన కారణం చేత తనకు ఇలా పెనాల్టి వేశారని టాక్. మరి దీనికి సంపూర్నేష్ స్పందన ఎలా ఉంటుండో చూడాలి.