కథ : కోటిశ్వరుడు కొడుకైన కృష్ణ తన తండ్రి 5 కోట్ల విలువగల కారు శమంతకమణిని కొంటాడు. ఓ పార్టీలో శమంతకమణి మిస్ అవుతుంది. స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పార్టీలో అనుమానితులుగా ఉన్న శివ (సందీప్ కిషన్), కార్తిక్ (ఆది), ఉమామహేశ్వర్ రావు (రాజేంద్ర ప్రసాద్) లను సిఐ రంజిత్ (నారా రోహిత్) అరెస్ట్ చేసి విచారణ జరుపుతుంటారు. ప్రతి ఒక్కరు తమతో శమంతకమణితో తమ ప్రయాణం చెబుతూ ఉంటారు. అసలు శమంతకమణిని కొట్టేసింది ఎవరు. ఇందులో ఎవరెవరు హస్తం ఉంది అన్నది అసలు కథ.
నటీనటుల ప్రతిభ :
యువ నటులు నలుగురు శమంతకమణిలో ముఖ్య పాత్రలు చేశారు. కృష్ణగా సుధీర్ బాబు మంచి నటన కనబరచగా, శివ గా సందీపి కిషన్ యాజూజువల్ గా అదరగొట్టాడు. ఇక కార్తిక్ గా ఆది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇక సిఐ రంజిత్ గా నారా రోహిత్ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఉమామహేశ్వర్ రావు గా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా పర్ఫార్మ్ చేసాడు. ఇక కోటీశ్వరుడిగా సుమన్ ఆకట్టుకున్నాడు.
సాంకేతిక్వర్గం పనితీరు :
శమంతకమణి సినిటోగ్రఫీస్ సూపర్ అని చెప్పాలి. మ్యూజిక్ కూడా పర్వాలేదు. ముఖ్యంగా ఎడిటింగ్ బాగుంది. సినిమా కథ కథనాల్లో దర్శకుడి టాలెంట్ తెలుస్తుంది. ఎక్కడ కన్ ఫ్యూజ్ లేకుండా సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ తో నడిపించాడు. భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
విశ్లేషణ :
భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన శ్రీరాం ఆదిత్య నుండి వచ్చిన రెండో మూవీ శమంతకమణి. నలుగురు కుర్ర హీరోలతో సినిమా తీయలన్న ఆలోచనే హైలెట్ అని చెప్పాలి. ఇక నలుగురు పాత్రల్లో నటించిన యువ హీరోలందరు అదరగొట్టేశారు. సుధీర్, ఆది, నారా రోహిత్, సందీప్ కిషన్ నలుగురు నటనతో ఎవరికి వారు పోటీ పడి నటించారు.
కథ కథనాల్లో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది. ఎంచుకున్న కథను ఎక్కడ మిస్ గైడ్ చేయకుండా సస్పెన్స్ థ్రిల్లర్ గా మంచి నడిపించాడు. సినిమాలో ఎంటర్టైనింగ్ పార్ట్ కూడా అదిరిపోయింది. కథ ఎలా ఉన్నా కథనంలో దర్శకుడు ఆకట్టుకున్నాడు. నలుగురు కుర్ర హీరోలను ఎవరి పాత్రకు వారు న్యాయం చేయగా వారిని వాడుకోవడంలో కూడా దర్శకుడు మార్కులు కొట్టేశాడు.
మంచి ఎంటర్టైన్ తో పాటుగా స్క్రీన్ ప్లే కూడా అద్భుతంగా నడిపించిన శమంతకమణి ఆడియెన్స్ ను మంచి థ్రిల్ చేయడం ఖాయం. కథగా చెప్పడానికి చాలా చిన్నదే అయినా సినిమా నడిపించిన తీరు మాత్రం అదరిని ఇంప్రెస్ చేస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
కాస్టింగ్
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్
డైరక్షన్
మైనస్ పాయింట్స్ :
మ్యూజిక్
బాటం లైన్ : శమంతకమణి కుర్రాళ్లు అదరగొట్టేశారు..!
రేటింగ్ : 2.5/5