Newsఇన్నేళ్ళ తరవాత మహేష్ గురించి మనసులో మాట బయట పెట్టిన...

ఇన్నేళ్ళ తరవాత మహేష్ గురించి మనసులో మాట బయట పెట్టిన సమంత

తాను నటించిన తొలి చిత్రం హీరోనే ప్రేమించి, అతని ప్రేమను కూడా పొంది త్వరలో ప్రఖ్యాత అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెడుతున్న సమంత ప్రస్తుతం తన జీవితంలోని మధుర క్షణాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది. తాజాగా ఆమె ట్విట్టర్‌తో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇంకా ఏమైనా అడగాలంటే అడగండని ప్యాన్స్‌ను జోష్‌తో నింపింది.

ఈ సందర్భంగా ఓ అభిమాని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి చెప్పమనడంతో ఆమె మహేష్‌ గురించి చెబుతూ, ఆయన షూటింగ్‌లలో బాగా ఉత్సాహంగా ఉంటారు. ఆయనుంటే సమయమే తెలియదు. సెట్స్‌ అంతా సందడే సందడిగా ఉంటుంది. కానీ అది షూటింగ్‌ బ్రేక్‌ సమయంలోనే. ఆయన తీయబోయే సీన్‌ గురించి, దానిలో చెప్పాల్సిన డైలాగ్స్‌ వంటి విషయాలపై ఆలోచన కేంద్రీకరించినప్పుడు మాత్రం ఆయన్ను డిస్ట్రర్బ్‌ చేస్తే ఇక కోపంతో ఊగిపోతారు. నవ్వినా ఒప్పుకోడు. ఆయన పనికి ఆయన కట్టుబడి ఉంటాడు. సినిమాపైనే దృష్టంతా కేంద్రీకరిస్తాడు.

ఆయనతో ‘దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో పాటు ‘బ్రహ్మూెత్సవం’లో కూడా నటించానని చెప్పుకొచ్చింది. ఇక ఆయన కుమార్తె సితారకు సమంత అంటే భలేఇష్టం. ఆమె చేసే సీన్స్‌ని సితార ఇమిటేట్‌ చేస్తూ ఉంటుంది. ఇక తనకు, చైతుకు మద్య వచ్చే కామన్‌ డిస్కషన్స్‌ ఏమిటి? అంటే డిన్నర్‌కి ఏం తిందామనేదే అని చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news