టాలెంటెడ్ హీరోయిన్స్ ను కనిపెట్టడం చాలా ఈజీ అది మన భాషలో సినిమా చేస్తేనే కాదు వేరే ఏ భాషలో సినిమా చేసినా ఆ సినిమా హిట్ అయితే అందులో మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలపై ప్రేక్షకులు మక్కువ పెంచుకుంటారు. అలానే మలయాళ ప్రేమం సినిమాలో మలార్ గా అదరగొట్టిన సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో ఫిదా మూవీతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భానుమతిగా నటించింది సాయి పల్లవి. చెప్పాలంటే ఫిదాలో అసలు హీరో సాయి పల్లవినే. భానుమతి సింగిల్ పీస్ అంటూ చెప్పిన డైలాగ్ ఆమెకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ఈమధ్య వచ్చిన నటీమణుల్లో ఈ భానుమతి అదేనండి సాయి పల్లవి చాలా స్పెషల్ అని చెప్పాలి. అభినయంతో ఆమె ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా వచ్చిన ఫిదా మూవీ సాయి పల్లవి కోసం చూసేయొచ్చు అన్న టాక్ వచ్చింది. ఇక అర్ధం చేసుకోవచ్చు సినిమాలో ఆమెను ఏ రేంజ్ లో చూపించారో. ముఖ్యంగా తెలంగాణా యాసలో సాయి పల్లవి మాట్లాడిన తీరు అందాన్ని తెచ్చింది. ఏదో డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పింది సాయి పల్లవి అభినయించింది అని కాదు.. ఇక్కడ అసలు విషయం ఏంటంటే తన డబ్బింగ్ తానే చెప్పుకుంది సాయి పల్లవి. సినిమా కమిట్ అయితే దానికి అన్నివిధాలుగా కష్టపడుతుంది సాయి పల్లవి. ఆ డెడికేషన్ ఇప్పుడు తెర మీద ఆమెను భానుమతిగా ఆవిష్కరించింది.
ప్రతి సీన్ లో ఆమె పర్ఫెక్షన్.. స్కోప్ ఉన్నంత వరకు కాదు ఆ స్కోప్ ను దొరకబట్టుకుని మరి ఆమె నటనతో అందరి మనసులను గెలుచుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిదా కేవలం సాయి పల్లవి షో.. ఇలాంటి నటీమణులను చూస్తుంటే బికినిలతో బెంబేలెత్తేలా చేసే హీరోయిన్ కన్నా ఇలా ఒకప్పటి మహానటులను గుర్తు చేసేలా వచ్చిన సాయి పల్లవి లాంటి వారికి ప్రతి సిని ప్రేమికుడు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.