Reviewsరెండు రెళ్ళ ఆరు మూవీ రివ్యూ... సాయి కొర్రపాటి ఖాతాలో మరో...

రెండు రెళ్ళ ఆరు మూవీ రివ్యూ… సాయి కొర్రపాటి ఖాతాలో మరో హిట్

తెలుగు సినిమాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న చిన్న సినిమాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. సినిమాలో హీరో ఎవరు.. బడ్జెట్ అంతా లెక్క లేమి చూసుకోకుండా కంటెంట్ ఎంత ఉంది అన్న లెక్క చూసుకుని చిన్న సినిమాలను హిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు జులై 8 న రాబోతున్న రెండు రెళ్ళు ఆరు సినిమా ప్రీమియర్ షో చూడటం జరిగింది .

పుట్టిన బిడ్డలు ఇరువై ఏళ్లకు చనిపోతారని తెలిసి ఓ ఇద్దరు తండ్రులు తమ భార్యలకు ఇష్టం ప్రకారం వారికి తెలియకుండానే పిల్లలను మార్చుకుంటారు. ఇక వారిని ఎప్పుడూ చూస్తుండాలని వారు ఇద్దరు ఎదురెదురు ఇళ్లలో ఉంటారు. ఈడోచ్చిన పిల్లలకు పెళ్లి చేయాలనుకున్న తల్లి నిర్ణయానికి షాక్ అవుతారు. వారిని ఇరవై ఏళ్లుగా వారిని విడదీయడానికి తండ్రి చేసిన ప్రయత్నాలు..? కలిపేందుకు తల్లులు చేసిన పనులేంటి అన్నది సినిమా కథ.

హీరో అనీల్ కథకు తగ్గట్టుగా వారి వారి పాత్రలలో బాగా నటించారు. ఇక సినిమాలో హీరోయిన్ మహిమా కూడా మంచి నటనను కనబరచింది. మధ్యతరగతి తండ్రిగా నరేష్ అదరగొట్టాడు. ఈ సినిమాకు నరేష్ సీనియారిటీ బాగా హెల్ప్ అయ్యింది. ఇక రావు గారి గా రవికాలె అద్భుతంగా నటించాడు. ఇప్పటిదాకా తను చేసిన సినిమాలన్నిటిలో ఇది తప్పకుండా డిఫరెంట్ గా ఉంటుందని అనాలి. మదర్ క్యారక్టర్స్ చేసిన లక్ష్మి, ప్రమోదిని కూడా తమదైన సహజ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో ప్రత్యేకంగా తాగుబోతు రమేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈమధ్య ఎక్కువగా కనిపించని తాగుబోతు రమేష్ ఈ సినిమాతో మళ్లీ బిజీ అవడం ఖాయం.

సినిమాలో విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది.. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేస్తుంది. సినిమాను రిలీజ్ చేసిన సాయి కొర్రపాటి మరోసారి తమ అభిరుచిని చాటుకున్నారు. కేవలం నిర్మాత అంటే హై బడ్జెట్ మూవీస్ మాత్రమే కాదు లో బడ్జెట్ సినిమాలతో కూడా మంచి ఫలితాలను తీసుకు రావొచ్చనే ఆలోచన కొర్రపాటి సాయి గారిది. అందుకే ఈ సినిమాను తన బ్యానర్లో రిలీజ్ చేసి సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చారు.

మంచి కథ.. దానికి తగ్గ కథనం.. కామెడీతో ఎంటర్టైన్ చేస్తూనే మనసుని కదలించే సన్నివేశాలు.. డైలాగ్స్..బాగున్నాయి. ఆర్టిస్టులు కొత్త వారైనా సరే కథ కథనాలు బలంగా ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా వారిని ఆదరిస్తారు అని చెప్పేందుకు ఈ సినిమా మరో ఉదాహరణ అవుతుంది. టైం పాస్ మాత్రమే కాదు సినిమా చూసి మంచి అనుభూతితో ఇంటికి వచ్చేయొచ్చు.

రేటింగ్: 3.5/5.0

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news