రిలయన్స్ జియో నుంచి కీలక ప్రకటన వెలువడింది. సంచలనాలకు కేంద్ర బిందువైన జియో నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందా? అని వినియోగదారులు, జియో వ్యూహాలకు అడ్డుకట్టే వేసే వ్యూహాలతో ప్రత్యర్థులు ఎదురుచూశారు. శుక్రవారం జియో నుంచి టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించే ప్రకటన వెలువడనుందన్న సమాచారంతో దేశ ప్రజలు మొత్తం అటువైపే దృష్టిసారించారు.
నేటి వార్షిక సాధారణ సమావేశంలో ఆ సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ అతి చవకైన 4జీ ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించారు. దీని ధర రూ.0 అవును దీని ధర కేవలం సున్నా అంటే ఫ్రీ. కానీ ఒకే సారి ఫ్రీగా ఇస్తే మిస్ యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొదట 1500 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా తీసికొని 3 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు వెనక్కి ఇవ్వబడుతుంది. ఈ ఫోన్ 2.4 అంగుళాల కలర్ డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, అవసరమైతే ఎస్డీ కార్డుతో మరింత పెంచుకునే వెసులుబాటు ఉన్నట్టు తెలుస్తోంది.ఆగష్టు 15 న బీటా యూజర్ టెస్టింగ్ ఫోనులు అందుబాటులోకి తెచ్చి.. ఆ తర్వాత ఈ ఫోనులు సెప్టెంబర్ నుండి వినియోగదారులకి అందుబాటులోకి రానున్నాయి. ఆగష్టు 24 నుండి బుక్ చేసుకున్నవారికి వారి బుక్ చేసుకున్న సమయాన్ని బట్టి వారికి ఫోన్ డెలివరీ అవుతుంది.