Newsసిట్ కార్యాలయానికి హుషారుగా చేరుకున్న రవితేజ... కానీ..

సిట్ కార్యాలయానికి హుషారుగా చేరుకున్న రవితేజ… కానీ..

మాదకద్రవ్యాల కేసులో నోటీసులందుకున్న ప్రముఖ హీరో భూపతిరాజు రవిశంకర్ రాజు అలియాస్ రవితేజ శుక్రవారం ఉదయం సిట్ బృందం ముందు హజరయ్యారు. కేసు విచారణలో భాగంగా సిట్ ఆయనను ప్రశ్నిస్తోంది. ఈరోజు వరకు ఇప్పటి వరకు ఎవరు వచ్చినా రాని అభిమానులు.. రవితేజ వస్తున్నాడని తెలిసి సిట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

అంతేగాక, రవితేజ కూడా నవ్వుతూ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటి వరకు హాజరైన వారందరూ మెట్ల ద్వారా సిట్ కార్యాలయం పై అంతస్తుకు వెళితే.. రవితేజను మాత్రం లిఫ్టులోనే పై అంతస్తుకు వెళ్లారు.

ఇంతవరకు పన్నెండుమంది సినీ ముఖ్యులకు నోటీసులు పంపిన అధికారులు.. ఆగస్టు 2తో విచారణను పూర్తి చేయనున్నారు. ఈ 12మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజలే కీలకమని సిట్ భావిస్తోంది.

డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితుడు జీషన్ అలీ… సినీ హీరోలు రవితేజ, నవదీప్లకు తాను కొకైన్ సరఫరా చేసేవాడినని ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈవెంట్లు, పబ్లలో పలువురు సినీ ప్రముఖులకు కొకైన్ అందించినట్లు జీషన్ అలీ చెప్పాడు. నవదీప్ పబ్లో నిర్వహించిన ఈవెంట్లలోనూ జీషన్ పాల్గొన్నాడు.

డ్రగ్స్ కేసులో మరో నిందితుడు కెల్విన్ కూడా సినీ ప్రముఖులకు డ్రగ్స్ను సరఫరా చేసినట్లు విచారణలో అంగీకరించాడు. పైపెచ్చు, ఈ కేసులో అరెస్టుచేసిన నిందితుల ఫోన్లలోని వాట్సాప్ చాటింగ్లు, సంభాషణలు, వీడియో క్లిప్పింగులు, ఫోన్ కాల్డాటాలు అధికారుల వద్ద ఉన్నాయి. పూరి జగన్నాథ్తో రవితేజకు సన్నిహిత సంబంధాలున్నాయని, వీరిద్దరూ ‘బ్యాంకాక్ బ్యాచ్’లో భాగస్వాములన్న వార్తలూ వెలువడ్డాయి. ఇప్పటికే రవితేజ సోదరులపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news