‘మిర్చి’ తర్వాత కొరటాల తో ఓ సినిమా కూడా ప్రారంభించిన రామ్ చరణ్, ధరణిలాగానే కొరటాలను భావించి తర్వాత చూద్దాంలే అని ఆ సినిమాను పక్కనపెట్టాడు. ఇప్పుడు అదే దర్శకునితో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. మరోపక్క కొరటాలతో సినిమా చేసిన హీరోలైన మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారే మరలా ఆయనతో రెండవ చిత్రాలను చేయలని తెగ ట్రై చేస్తున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ మహేష్‌తో రెండో సినిమాగా ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. మరోపక్క చరణ్ సుక్కుతో ‘రంగస్థలం 1985’ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయి తర్వాత తన కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిరంజన్ రెడ్డిని భాగస్వామిగా చేసుకుని చరణ్ కొరటాలతో ఓకే అయ్యాడు. కానీ ఇప్పుడున్న డిమాండ్ దృష్ట్యా కొరటాల తన సమయం ఇప్పుడొచ్చిందని భావించి ఏకంగా 15కోట్ల ప్యాకేజీని కోరాడని సమాచారం. తప్పదు కదా…! ఒకప్పుడు అవమానించాడు కాబట్టి ఇప్పుడు ఆ మాత్రం పెనాల్టీ పడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.