బుల్లితెర మీద తన విశ్వరూపం చూపించడానికి సిద్ధమైన తారక్ బిగ్ బాస్ తో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. స్టార్ మాలో ఎంట్రీ ఇచ్చిన తారక్ జోష్ కు అందరి నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు. ముఖ్యంగా తాము చేసే యాంకరింగ్ కు ఓ కొత్త కలరింగ్ వచ్చిందంటూ టివి యాంకర్లంతా మురిసిపోతున్నారు.
బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్.టి.ఆర్ ఓ పెద్ద రిస్క్ నే చేస్తున్నాడని అనుకోవచ్చు. కాని ఆ టెన్షన్ ఏమాత్రం తారక్ ముఖంలో కనిపించలేదు. మొదటి ఎపిసోడ్ ఎన్ని అంచనాలతో స్టార్ట్ అయ్యిందో అదే రేంజ్ రెస్పాన్స్ ను అందుకుంది. ఇక ఈ షో చూసి సెలబ్రిటీస్ తమ అభిప్రాయాలను తెలియచేశారు. యువ హీరోల్లో టివి హోస్ట్ గా ముందె బుల్లితెర మీదకు వచ్చిన దగ్గుబాటి రానా తారక్ కు హోస్టింగ్ ప్రపంచానికి స్వాగతం.. గుడ్ లక్ అంటూ తన స్పందన తెలియచేశాడు.
ఇక అదే విధంగా ఫీమేల్ యాంకరింగ్ డామినేషన్ అనుకుంటున్న ఈరోజుల్లో తనదైన స్టైల్ లో బుల్లితెర లో హీరో అనిపించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ షోపై తన స్పందన కూడా తెలియచేశాడు. అన్నా తారక్ నువ్వు రాక్ స్టార్.. నీ కష్టం నాకు తెలుసు.. టివి ప్రపంచానికి స్వాగతమని ట్వీట్ చేశాడు.
ఇక వీరే కాదు తారక్ స్మాల్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తాడో అని సిని సెలబ్రిటీస్ అంతా టివిలకు అతుక్కుపోయారంటే నమ్మాలి. ఓ పక్క జై లవకుశలో రావణగా అదరగొట్టినన్ తారక్ బిగ్ బాస్ హోస్ట్ గా భలే జోష్ కొనసాగించాడు. అంతేకాదు 14 మంది కంటెస్టంట్స్ వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించడమే కాదు వారికి ఎంతో సహకరిస్తూ బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించాడు. బిగ్ బాస్ హౌజ్ లో హౌజ్ మెట్స్ గా ఉన్న వారంతా తారక్ అంటే ఇష్టమున్న వారే అవడం విశేషం.
ఎన్.టి.ఆర్. మొదటి ఎపిసోడ్ ముగిసింది.. ఇక తేల్చుకోవాల్సింది కంటెస్టంట్స్ మాత్రమే.. అసలు 14మందిలో చివరి దాకా ఎవరు ఉంటారు. ఎవరు బిగ్ బాస్ మనసు గెలుస్తారో చూడాలి.
ఇక TRP విషయానికొస్తే 98 శాతం తెలుగు రాష్ట్ర ప్రజలు ఆదివారం ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ని చూశారంట. 5 పాయింట్లకు గాను 4.8 పాయింట్లతో అంతకుముందు నాగార్జున సాధించిన 4.1 మరియు మెగాస్టార్ MEK కు వచ్చిన 3.4 పాయింట్లను అధిగమించి ఎవరికీ అందని రికార్డు స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది.