Gossipsదిల్ రాజు ఆఫీస్ పై మెగా ఫ్యాన్స్ దాడి.. మెగా బ్రదర్...

దిల్ రాజు ఆఫీస్ పై మెగా ఫ్యాన్స్ దాడి.. మెగా బ్రదర్ ను టార్గెట్ చేశారు..!

డిజె కలక్షన్స్ హంగామాలో నైజాంలో 20 కోట్లు కలెక్ట్ చేసిందంటూ నానా రచ్చ చేశారు. అంతేకాదు ఇవి తప్పని నిరూపిస్తే హరిష్ శంకర్ సినిమాలను కూడా మానేస్తా అని ఛాలెంజ్ చేశాడు. నాన్ బాహుబలి రికార్డులన్ని డిజె కొల్లగొట్టిందన్న వార్తలను సహించలేని మెగా ఫ్యాన్స్ దిల్ రాజు ఆఫీస్ పై దాడి చేశారు. ఈ సీన్ అంతటికి కారణం మెగా ఫ్యాన్సే అని అంటున్నారు. ముందు పవర్ స్టార్ ఫ్యాన్స్ మీద నెట్టేద్దామని చూసినా దాడి చేసింది మెగా ఫ్యాన్సే అని తేలింది.

అయితే మెగా ఫ్యాన్స్ చేసే ప్రతి విషయంలో అటు హీరోలకు ఇటు ఫ్యాన్స్ కు మధ్యలో మెగా బ్రదర్ నాగబాబు ఉంటూ వచ్చారు. మెగా ఫ్యాన్స్ ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా సరే దానికి నాగ బాబు ఆమోదం ఉండాల్సిందే. మరి దిల్ రాజు ఆఫీస్ పై మెగా ఫ్యాన్స్ దండయాత్ర నాగ బాబు ప్రమేయం లేకుండా ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు.

ఒకవేళ నాగ బాబుకి తెలిస్తే కనుక కచ్చితంగా ఫ్యాన్స్ ను మధ్యలో ఆపేవాడు. మెగా హీరోలంతా ఒక్కటే అని చెప్పుకుంటుండగా ఈ దాడి వల్ల న్యూస్ చాలా పెద్దది అయ్యింది. అది కాక నాగ బాబు ప్రస్తుతం బన్ని నటిస్తున్న నా పేరు సూర్య సినిమాకు కో ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు. సో ఏ రకంగా చూసినా సరే దిల్ రాజు ఆఫీస్ పై మెగా ఫ్యాన్స్ గొడవలో నాగ బాబు పాత్ర మాత్రం లేదని అంటున్నారు. మరి అసలు గొడవ ఎందుకు చేశారు దీనికి మెగా హీరోలు కూడా ఇప్పటికి రియాక్ట్ అవకపోవడం అన్నది కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news