Politicsచిరు ప్రజా రాజ్యం.. పవన్ జనసేన.. కుల రాజకీయాలపై స్పందించిన కెసిఆర్

చిరు ప్రజా రాజ్యం.. పవన్ జనసేన.. కుల రాజకీయాలపై స్పందించిన కెసిఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పలు ఆసక్తికరమైన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు రాష్ట్రాల్లో రాజకీయాలపై స్పందించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ‌లో కుల‌ రాజ‌కీయాలు లేవు. అలాగే ఆంధ్రాలో కుల‌ రాజ‌కీయాలు ఇప్ప‌ట్లో వీడ‌వు అని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇక ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేంద్రమంత్రి అయిన మెగాస్టార్ చిరంజీవి గురించి సైతం కేసీఆర్ ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “చిరంజీవి పార్టీని న‌డ‌ప‌లేక క‌ట్టెల‌మోపులాగా బ‌రువు దింపుకున్నారు కానీ తాను అలా కాదు. 14 ఏళ్లు పార్టీ న‌డిపా. ఉద్య‌మం చేశా. ఆ తర్వాతే అనుకున్న లక్ష్యం సాధించాను అని అన్నారు కేసీఆర్.

ప్రజా జీవితంలో ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలి. ఒక ల‌క్ష్యం కోసం ప‌నిచేయాలి. అప్పుడే విజయం సిద్ధిస్తుంది అని అన్నారు కేసీఆర్. ఇదిలావుంటే, సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించే క్రమంలో పవన్ కల్యాణ్ అలా చేతులూపితేనే ఓట్లు ప‌డ‌తాయా అని ప్రశ్నించారు కేసీఆర్. ఎప్పుడైనా, ఏ రాజకీయ పార్టీకైనా సరైన పునాది ఉండాలి. అది లేకుండా విజయం సాధించడం కష్టం అని జనసేన పార్టీపై తన అభిప్రాయాన్ని వినిపించారు కేసీఆర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news