Newsజియో ఫ్రీ ఫోన్.. ఎలా తీసుకోవాలి?..పూర్తి వివరాలు మీకోసం

జియో ఫ్రీ ఫోన్.. ఎలా తీసుకోవాలి?..పూర్తి వివరాలు మీకోసం

జియో ఫ్రీ ఫోన్స్ ఈ ప్రకటన వినగానే.. ఎప్పుడెప్పుడూ అందుకుందామనే ఆతృత అందరిలోనూ కలిగింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ యావత్ టెలికాం సినారియోనే మార్చేశాడు. ఉచితంగా డేటా ఇవ్వడం పక్కన పెడితే… ఏకంగా ఫోన్లనే ఇవ్వడానికే ముందుకొచ్చేశాడు. దేవుడివయ్యా నువ్వంటూ… నెటిజన్లు ఆకాశానికెత్తేశారు. రూ.1500కు ఫోన్ కొనండి… మూడేళ్ల తర్వాత డబ్బులు వాపస్ ఇచ్చేస్తామని ప్రకటించాడు. అంతేనా వారానికి 50 లక్షల ఫోన్లు… 2017  డిసెంబర్ పూర్తయ్యే నాటికి సుమారు 8 కోట్ల ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తానని తెలిపాడు. భారత టెలికాం మార్కెట్ రూపురేఖలనే మార్చేసే ప్రకటన ఇది. మేడిన్ ఇండియా అంటూ జనం ముందుకు వస్తున్న ఈ ఫోన్… ఆగస్ట్ 15న విడుదలవుతోంది. ఆగస్ట్ 24 నుంచి ఆన్ లైన్ బుకింగ్ లు ప్రారంభమవుతుంటే… సెప్టెంబర్ నెలలో బహిరంగ మార్కెట్ లో లభించనున్నాయి. ఇంతకూ ఈ ఫోన్ ఎలా తీసుకోవచ్చో పూర్తిగా చెప్పలేదు కదా… ఇదిగో ఇలా…

స్టెప్ 1 – మై జియో యాప్(MyJio app) ద్వారా బుక్ చేసుకోవాలి.

స్టెప్  2 – రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో కూడా బుక్ చేయొచ్చు.

స్టెప్ 3 –  అదీ కుదరకపోతే టోల్ ఫ్రీ నంబర్ 1860-893-3333 ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బుకింగ్ లన్నింటికీ ఆగస్ట్ 24 వరకు ఆగాల్సిందే.

స్టెప్ 4 – ఆగస్ట్ 15న లాంచ్ చేస్తారు.. 24 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభమవుతాయి.  తర్వాత సెప్టెంబర్ లో బహిరంగ మార్కెట్ లో ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయి.

స్టెప్ 5 – ఫోన్ పొందడానికి రెండు ఆప్షన్లు.. స్టోర్ లేదా ఆన్ లైన్ లో పొందొచ్చు.

అదండి సంగతీ… ఫ్రీ ఫోన్లు కావాలనుకునే వారందరూ ఆగస్ట్ 24 నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. భారతీయ ముద్రతో వస్తున్న తొలి ఫోన్ ఇది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news