Newsసాయి ధరమ్ తేజ్ జవాన్ టీజర్ రివ్యూ.. దేశభక్తి అంటే కిరీటం...

సాయి ధరమ్ తేజ్ జవాన్ టీజర్ రివ్యూ.. దేశభక్తి అంటే కిరీటం కాదు

తిక్క , విన్నర్ సినిమాలు పరాజయం పాలవడంతో కొంచెం గ్యాప్ తీసుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, bvs రవి దర్శకత్వం లో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. కొన్ని నిమిషాల క్రితం విడుదల చేసిన జవాన్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. “కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది.కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది.దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత.. ” అంటూ సాగే డైలాగు సాయి చాలా ఇంటెన్సిటీ తో చెప్పాడు. విజువల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. టీజర్ చూస్తుంటే సాయి స్టూడెంట్ లీడర్ నుండి జవాన్ గా మారతాడనిపిస్తుంది.. అలాగే కొన్ని థ్రిల్లర్ ఎలెమెంట్స్ కూడా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సాయి ధరమ్ తేజ్ గత సినిమాల నుండి పాఠం నేర్చుకుని చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ ఎంచుకున్నట్లుగా అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news