‘రావణా శక్తి శాసనా’.. జై లవకుశ సాంగ్ లీక్ ఫ్యాన్స్ కు పూనకాలే..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూనకాలు వచ్చే న్యూస్ ఇది.. జై టీజర్ తో సంభ్రమాశ్చర్యాలతో జబ్బ చరిచి ఇది తారక మంత్రమని ప్రతి అభిమాని భావించేలా చేసిన యంగ్ టైగర్ ఇప్పుడు ఆ సినిమాలో ప్రతి సర్ ప్రైజ్ ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తపడుతున్నాడు. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ అవుతుండగా ఆగష్టు 12న సినిమా ఆడియో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ‘రావాణా శక్తి శాసనా’ అంటూ వచ్చే ఓ సాంగ్ లీక్ అయ్యింది. సాంగ్ వింటే ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం కన్ఫాం అని చెప్పొచ్చు. కేవలం 37 సెకన్లు మాత్రమే ఉన్న ఈ పాట జై పాత్రని వర్ణిస్తూ వచ్చేదిగా ఉంది. ఇక సినిమాలో తారక్ జై లవ కుశ మూడు రోల్స్ లో కెరియర్ లో మొదటిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు.

రాశి ఖాన్నా, నివేథా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. టీజర్ తో సంచలనం సృష్టించిన జై ఇప్పుడు ఈ పాటతో కూడా సినిమాపై అంచనాలను పెంచేశాడు.

Leave a comment