Newsడ్రగ్స్ కేసులో సినీ నటి చార్మిపై హైకోర్టులో షాకింగ్ ...

డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మిపై హైకోర్టులో షాకింగ్ తీర్పు..!!

నా క్లయింట్ అయిన హీరోయిన్ చార్మీకి ఇంకా పెళ్లి కాలేదు.. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నాయంటూ హైకోర్టులో వాదించారు చార్మి లాయర్. విచారణ ఆపేయాలని.. నిందలు వేయటం సరికాదన్నారు. బలవంతంగా శాంపిల్స్ తీసుకోవటం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. విచారణ నుంచి నా క్లయింట్ చార్మిని ఉపసంహరించాలని కోరారు. చట్టానికి విరుద్ధంగా సిట్ విచారణ సాగుతుందని.. అది న్యాయబద్దంగా కాదన్నారు.

డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి హైకోర్టు ఊరట వచ్చింది. విచార‌ణ‌కు న్యాయ‌వాదిని అనుమతించ‌డంతో పాటు బ‌ల‌వంతంగా ర‌క్త న‌మూనాలు సేక‌రించ‌డం చ‌ట్ట విరుద్ద‌మంటూ చార్మి త‌న పిటీష‌న్ లో పేర్కొంది. చార్మి పిటీష‌న్ ని కోర్టు విచారించ‌గా, ఆమె వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. సిట్ విచార‌ణ‌లో ఛార్మి తో పాటు న్యాయ‌వాదిని అనుమ‌తించేందుకు నిరాక‌రించింది. బ‌ల‌వంతంగా ఛార్మి ర‌క్త న‌మూనాలు సేక‌రించ‌రాదు అని హైకోర్టు ఆదేశించింది. చార్మిని ఉద‌యం 10 నుండి సాయంత్రం 5 వ‌ర‌కు విచారించాలి, ఒక వేళ విచార‌ణ పూర్తికాక‌పోతే మ‌రోసారి పిలిపించ‌వ‌చ్చు అని హైకోర్టు తెలిపింది. విచార‌ణ బృందంలో మ‌హిళ‌ను కూడా నియ‌మించాలి అని హైకోర్టు పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news