Reviewsమాస్ ఆడియెన్స్ ను మెప్పించే గౌతమ్ నంద

మాస్ ఆడియెన్స్ ను మెప్పించే గౌతమ్ నంద

మాస్ ఆడియెన్స్ ను మెప్పించే గోపిచంద్ సడెన్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో వెళ్లాడు. లౌక్యం హిట్ అయ్యింది కదా అని సౌఖ్యం తీస్తే అది కాస్త నిరాశ పరచింది. అందుకే ఈసారి మంచి మాస్ మసాల సినిమాతో వచ్చాడు గోపిచంద్. సంపత్ నంది డైరక్షన్ లో గౌతమ్ నందగా రెండు పాత్రలలో అదరగొట్టాడు.

కథ విషయానికొస్తే.. ప్రపంచంలో టాప్ 10 బిలీనియర్లలో ఒకరైన కృష్ణమూరి వారసుడు గౌతమ్ (గోపిచంద్) విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ పరిస్థితిలో తనకు తానుగా ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచనతో అన్నిటిని వదిలి పోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి అతని పోలికలతోనే నంద (గోపిచంద్) ప్రత్యక్షమవుతాడు. పేదరికంలో ఉన్న నంద డబ్బు కోసం ఏ చేయడానికైనా సిద్ధపడతాడు. ఇద్దరు కలిసి ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరిగింది అన్నది సినిమా.

నటన పరంగా గౌతమ్ నందలో గోపిచంద్ అన్ని తానై నడిపించాడని చెప్పొచ్చు. రెండు పాత్రల్లో చక్కని వేరియేషన్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఇక హీరోయిన్స్ కేథరిన్, హాన్సిక ఇద్దరు గ్లామర్ కోసమే సినిమాలో ఉన్నారని చెప్పొచ్చు. బిత్తిరి సత్తి కామెడీ అదరగొట్టింది. తణికెళ్ల భరణి, చంద్ర మోహన్ వారి పాత్రల పరిధి మేరకు నటించి అలరించారు.

గౌతమ్ నంద టెక్నికల్ టీం విషయానికొస్తే.. ముందుగా సౌందర్ రాజ సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పొచ్చు. సినిమా చాలా స్టైలిష్ గా వచ్చింది అంటే అది కచ్చితంగా ఆయన కెమెరా పనితనం వల్లే. ఇక ఎడిటింగ్ పర్వాలేదు. మ్యూజిక్ డైరక్టర్ తమన్ కేవలం రెండు పాటల్లో తన టాలెంట్ వాడాడు ఇక మిగతా వాటిని ఏదో నడిపించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఇక దర్శకుడు సంపత్ నంది కథ పాత చింతకాయ పచ్చడే అయితే కథనంలో తను తీసుకున్న కొత్తదనం బాగుంటుంది. మొదటి భాగం కాస్త పర్వాలేదు కాని సెకండ్ హాఫ్ లో స్లో నేరేషన్ సెంటిమెంటల్ గా సాగే సరికి కాస్త బోర్ కొడుతుంది. మళ్లీ సినిమాను ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అదరగొట్టాడు. సినిమాకు గోపిచంద్ నటన, హీరోయిన్స్ గ్లామర్, ఎంటర్టైన్మెంట్ ప్లస్ పాయింట్స్, మ్యూజిక్ స్క్రీన్ ప్లే మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు.

రేటింగ్ : 2.5/5

బాటం లైన్ : గౌతమ్ నంద మాస్ ఆడియెన్స్ కోసమే..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news