ప్రస్తుతం యువ కమెడియన్ల జోరులో బ్రహ్మానందం కెరియర్ దాదాపు ముగియగా పోటీలో టాప్ ప్లేస్ లో నిలిచాడు వెన్నెల కిశోర్. ఓ పక్క థర్టీ ఇయర్స్ పృధ్వి కూడా కామెడీలో మంచి ఫాంలో ఉన్నా అతనిది కేవలం స్పూఫ్ కామెడీ అని తేల్చిపారేశారు. అందుకే ఒరిజినల్ కామెడీతో తనదైన శైలిలో నవ్వులు పంచుతున్న వెన్నెల కిశోర్ అందరి మనసులను గెలిచాడు.బ్రహ్మానందం తర్వాత వెన్నెల కిశోర్ అంతటి క్రేజ్ తో రోజుకి ఏకంగా రెండున్నర లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. వెన్నెల సినిమాతో తెరంగేట్రం చేసిన కిశోర్ ఆ తర్వాత మంచి కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్నాడు.
రీసెంట్ గా రిలీజ్ అయిన అమీ తుమీ సినిమాలో వెన్నెల కిశోర్ కామెడీ ఎంత బాగా పండిందో తెలిసిందే. సినిమాలో శ్రీ చిలిపిగా ఇరగదీశాడు వెన్నెల కిశోర్. మరి ఇంత టాలెంట్ ఉన్న కమెడియన్ కు రోజుకి ప్రస్తుతం ఇస్తున్న పారితోషికం సబబే అని చెప్పాలి. డిమాండ్ మేరకు స్టార్లు తమ రెమ్యునరేషన్ పెంచడం కామనే.. ప్రస్తుతం తన టైం నడుస్తుండటంతో తను అడిగినంత కాదనకుండా ఇస్తున్నారు దర్శక నిర్మాతలు.