Gossipsనందమూరి కళ్యాణ్ రామ్ మళ్ళీ రిస్క్ !!

నందమూరి కళ్యాణ్ రామ్ మళ్ళీ రిస్క్ !!

నందమూరి కళ్యాణ్ రామ్ కొంత విరామం తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అతను హీరోగా ‘ఎంఎల్ఏ’ అనే సినిమా మొదలు కాబోతోంది. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే అమెరికాలో పర్యటించిన కళ్యాణ్ రామ్.. ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన కూడా చేశాడు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ చిత్రానికి కథానాయక కూడా ఖరారైందన్నది తాజా సమాచారం. ఈ వారమే విడుదల కానున్న ‘ఫ్యాషన్ డిజైనర్’లో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటించిన మనాలి రాథోడ్ కళ్యాణ్ రామ్‌తో జత కట్టనున్నట్లు తెలుస్తోంది.

ఐతే మనాలికి కళ్యాణ్ రామ్ సరసన నటించేంత రేంజ్ ఉందా అన్నది డౌటు. ఆమె ఇప్పటిదాకా చేసినవన్నీ చిన్నా చితకా సినిమాలే. ‘గ్రీన్ సిగ్నల్’ అని.. ‘ఓ స్త్రీ రేపురా’ అని ఊరూ పేరు లేని సినిమాల్లో నటించింది మనాలి. ‘ఫ్యాషన్ డిజైనర్’ ఒక్కటే కొంచెం చెప్పుకోదగ్గ సినిమా. కళ్యాణ్ రామ్ అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. పైగా కొత్త దర్శకుడు తీయబోయే సినిమా. అలాంటపుడు కొంచెం పెద్ద స్థాయి హీరోయిన్ ఎవరిరైనా తీసుకుంటే బాగుండేదేమో. ఐతే కళ్యాణ్ రామ్‌కు ఇలాంటి సాహసాలు మామూలే కాబట్టి లైట్ తీసుకోవాలేమో.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news