ముఖ్యంగా దాసరి పెద్ద కొడుకు తారక ప్రభు నుంచి విడిపోయిన అతడి భార్య సుశీల దాసరి మరణానంతరం మీడియా ముందుకొచ్చి మాట్లాడిన మాటలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఆమె మాటల్ని బట్టి చూస్తుంటే ఆస్తి పంపకాలు.. ఆర్థిక వ్యవహారాల విషయంలో పెద్ద గొడవలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇండస్ట్రీలో దాసరి చాలామందికి అప్పులు.. అడ్వాన్సులు ఇచ్చారని.. వాటిలో చాలా వరకు తిరిగి రాలేదని.. కొంచెం కోలుకున్నాక ఇవన్నీ సెటిల్ చేయాలని దాసరి అనుకున్నారని.. అంతలోనే ఊహించిన విధంగా మృత్యువు ఆయన్ని తీసుకెళ్లిపోయిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వివాదాల్ని.. ఆర్థిక లావాదేవీల్ని ఎవరు సెటిల్ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు దాసరి దత్త పుత్రుడు మోహన్ బాబే సరైన వ్యక్తి అంటున్నారు. దాసరి అనారోగ్యం పాలైనపుడు.. ఆయన చనిపోయినపుడు.. అంత్యక్రియల సమయంలో మోహన్ బాబు.. దాసరి కన్న కొడుకుల కన్నా చురుగ్గా వ్యవహరించారు. అన్నీ తానై చూసుకున్నాడు.
ఇప్పుడు దాసరి కుటుంబంలో ఆస్తి పంపకాల బాధ్యత కూడా ఆయనకే అప్పగిస్తారని.. అలాగే ఇండస్ట్రీలో దాసరికి రావాల్సిన పేమెంట్ల వివరాలన్నీ పరిశీలించి.. వాటిని కూడా మోహన్ బాబే సెటిల్ చేయబోతున్నారని అంటున్నారు. దాసరి లాగా మోహన్ బాబు మాత్రమే ఎవరినైనా కమాండ్ చేయగలరని.. కాబట్టి తన గురువు కుటుంబానికి న్యాయం చేసే బాధ్యతను ఆయనే తీసుకుంటారని భావిస్తున్నారు.