Technologyజియో ఫోన్ వచ్చేస్తోంది... తెచ్చేసింది మరొక అద్భుత ఆఫర్.. అతి తక్కువ...

జియో ఫోన్ వచ్చేస్తోంది… తెచ్చేసింది మరొక అద్భుత ఆఫర్.. అతి తక్కువ ధరకే!!

అతి త్వరలో మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్న రిలయన్స్ జియో 4జీ వీఓఎల్టీఈ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ’91 మొబైల్స్’ కథనం ప్రకారం, గ్రామీణ భారతావనిలోని అపారమైన మార్కెట్ పై కన్నేసిన ముఖేష్ అంబానీ ఈ తక్కువ ధర ఫోన్లకు రూపకల్పన చేశారు. అన్ని జియో యాప్స్, 4జీ సిమ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే, అతి తక్కువ ధరకు కాల్స్ చేసుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ లో 2.4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం, 2 ఎంపీ రేర్ కెమెరా, ముందువైపు వీజీఏ కెమెరా ఉంటాయి. వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ సదుపాయాలుంటాయి. మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ తదితరాలకు డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి. రెండు మోడల్స్ లో ఇవి లభ్యం కానుండగా, వీటి ధరలు రూ. 1700 వరకూ ఉండగా, తొలి దశలో సబ్సిడీపై రూ. 999 నుంచి రూ. 1,500 మధ్య విక్రయించాలని ముఖేష్ భావిస్తున్నారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news