సరైనోడు సినిమా తరవాత చాలానే గ్యాప్ తీసుకున్న హీరో అల్లూ అర్జున్ హరీష్ శంకర్ చేతిలో తన భవిష్యత్తు పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ తప్ప గతం లో గబ్బర్ సింగ్ తరవాత హిట్ లు లేని హరీష్ కి బన్నీ కాల్ షీట్ లు ఇవ్వడం ఎందుకా అనుకున్నారు అందరూ. అయితే సినిమా ట్రైలర్ లూ, పాటలూ , టీజర్ లూ చూసిన తరవాత మాత్రం హరీష్ గట్టిగానే సినిమా సాగిస్తాడు అనిపించింది .. మొత్తం మీద సినిమా ఎలా ఉందొ చూద్దాం
కథ – పాజిటివ్ లు :
దువ్వాడ జగన్నాథం చిన్నతనం లోనే లోకల్ పోలీస్ ఆఫీసర్ (మురళి శర్మ) తో కలిసి డీజే గా మారతాడు. మనిషి కనపడకుండా నే మంచి చెయ్యచ్చు అనే తన తాత చెప్పిన సిద్ధాంతం తో పోలీసు సహాయం తో అన్యాయం చేసే వాళ్ళ ఆట కట్టిస్తూ ఉంటాడు. డీజే అనే పేరు వినడమే తప్ప అతనొక గ్యాంగ్ స్టర్ అని తెలుసు కానీ మొఖం చూసినవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలా పెరిగి పెద్ద అయిన డీజే ఒక పక్క అగ్రహారం లో బ్రాహ్మణుడు గా వంటలు చేస్తూ మరొక పక్క ఎవరికీ తెలీకుండా ప్రాణాలు తీస్తూ ఉంటాడు. ఈ నేపధ్యం లో అగ్రీ డైమండ్ అనే సంస్థ పెట్టి జనాలని మోసం చేస్తున్న రొయ్యల నాయుడు తన బినామీ తో ఈ బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం డీజే సినిమా మొత్తం ప్రయత్నం చేస్తాడు . చివరికి రొయ్యల నాయుడు ఎవరు అతను దొరికాడా లేదా అనేది తెర మీద చూడాలి .. ఈ సినిమాకి పాటలు అతిపెద్ద ఆస్తిగా చెప్పుకోవాలి , ఆడియో తో పాటు స్క్రీన్ మీద కూడా సాంగ్స్ కుమ్మేసాయి. ఫైట్ ల విషయం లో ఎలివేషన్ లు బాగా ప్లాన్ చేసాడు డైరెక్టర్ హరీష్ శంకర్. హరీష్ డైలాగ్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ లు .. అయ్యాయి. ప్రీ క్లైమాక్స్ ఫైట్ , లాస్ట్ లో వచ్చే కామెడీ సినిమాని నిలబెట్టాయి అని చెప్పచ్చు .
నెగెటివ్ లు : ఈ సినిమాకి అతిపెద్ద నెగెటివ్ ఈ సినిమా కథ . పరమ రొటీన్ , బోరింగ్ కథని ఎంచుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ దాన్ని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చెయ్యాల్సింది పోయి ట్రాక్ కూడా రొటీన్ గానే తీసుకోవడం తో చాలా చోట్ల బోర్ కొడుతుంది. అదుర్స్ లో ఎన్టీఆర్ చేసిన బ్రాహ్మణుడి క్యారెక్టర్ నటన లో ఇరవై శాతం కూడా అల్లూ అర్జున్ చెయ్యలేక పోయాడు. శాస్త్రి క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పండించిన హాస్యమే వేరు ఆ రేంజ్ లో అల్లూ అర్జున్ నటన లేకపోవడం కాస్త మైనస్. పూజా అందాలు పాజిటివ్ అయినా ఆమె క్యారెక్టర్ కాస్త తగ్గింది .
మొత్తంగా : మొత్తం మీద చూస్తే దువ్వాడ జగన్నాథం సినిమా పక్కా రొటీన్ బొమ్మ అయినా పాజిటివ్ అసెట్ లతో ముందుకు వెళ్ళాడు బన్నీ. స్టైలింగ్ లో తన మార్క్ చూపిస్తూ సినిమాని గ్రిప్ లోకి తెచ్చుకునే కామెడీ, ఫైట్ లూ , సాంగ్స్ లాంటి అంశాలలో వంద మార్కులు వేయించుకుని అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు అనిపిస్తుంది. డైరెక్టర్ కంటే రైటర్ గా హరీష్ కి ఎక్కువ మార్కులు పడ్డాయి. డైలాగ్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ , ఫస్ట్ హాఫ్ లో కొంత, ఆఖర్లో వింత కామెడీ ఇవన్నీ కలగలిపి చూస్తే చాలా చోట్ల బోర్ కొట్టినా వీటి వలన డీజే గట్టెక్కింది అనే చెప్పచ్చు. థియేటర్ లలో బాహుబలి 2 తరవాత ఒక్క సినిమా కూడా లేకపోవడం, జనం పెద్ద సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న టైం కావడం తో అన్నీ కలిసొచ్చి డీజే కి డీసెంట్ రెవెన్యూ వచ్చి తీరుతుంది అని చెప్పచ్చు.