ఖైదీ నెంబర్ 150 దెబ్బతో రాజకీయ రంగంలో ఎదురైన పరాభవాలు మర్చిపోవచ్చని సంబరపడిపోయారు. అయితే అనూహ్యంగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో దారుణమైన ఫ్లాప్ అయింది. చిరంజీవి హోస్ట్ చేయడం వల్ల ఈ షో పెద్ద హిట్ అవుతుందని భావిస్తే దారుణమైన టీఆర్పీలతో ఫ్లాపయింది. ఆ కాన్సెప్ట్ బాగా పాతబడిపోయిందని, అందుకే జనం ఆసక్తి చూపించలేదని నచ్చ చెప్పుకున్నారు.
తాజాగా ఖైదీ నెంబర్ 150 కి వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ చూసి ఫాన్స్‌కి నోట మాట రావడం లేదు.అయితే అంతకుముందు ఈ సినిమాకు టాప్ టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.అయితే అధికారికంగా వచ్చిన టీఆర్పీ రేటింగ్స్ డిజాస్టర్ సినిమాలకి వచ్చే రేటింగ్స్ కంటే దీనికి తక్కువ రావడంతో ఎలా డిఫెండ్ చేసుకోవాలో కూడా తెలీడం లేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో హిట్ అయినట్టు అనుకోవాలా లేక ఫ్లాపేనా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.