పెద్ద సినిమాలు పోటీలో లేనపుడు వీకెండ్లో చిన్న సినిమాలు రెండు మూడైనా రిలీజవుతుంటాయి. ఐతే అనుకోకుండా ‘అమీతుమీ’కి పోటీ తప్పిపోయింది. ముందు జూన్ 9న అనుకున్న ‘దర్శకుడు’ వాయిదా పడగా.. ‘అమీతుమీ’తో పాటే విడుదలకు సిద్ధమైన ‘ఆరడుగుల బుల్లెట్’ ఆర్థిక కారణాలతో అనూహ్యంగా రేసు నుంచి తప్పుకుంది. అదే సమయంలో ‘అమీతుమీ’ పాజిటివ్ టాక్‌తో మొదలైంది. సినిమా గొప్పగా ఏమీ లేకపోయినా.. కేవలం వెన్నెల కిషోర్ కామెడీ కోసం డబ్బులు పెట్టేయొచ్చన్న టాక్ స్ప్రెడ్ అయింది. ‘అమీతుమీ’కి మామూలుగా వచ్చిన ప్రేక్షకులతో పాటు ‘ఆరడుగుల బుల్లెట్’ కోసం వచ్చి నిరాశకు గురైన వాళ్లూ ఈ సినిమా వైపు మళ్లడంతో తొలి రోజు ఈ సినిమా జనాలతో కళకళలాడింది.
శ్రీ చిలిపి గా చేసిన వెన్నెల కిషోర్ తన కెరీర్ మొత్తంలో ఫుల్ లెంగ్త్ టాప్ కామెడీ క్యారెక్టర్ ఈ సినిమాలో పోషించడంతో పాటు కామెడీ టైమింగ్ తో అదరగొట్టి పడేశాడు.అమీ తుమీ కేవలం వెన్నెల కిషోర్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారంటే ఈ సినిమాలో మన వాడి పాత్ర ఎంత పేలిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే హీరోయిన్ ఇషా కూడా తెలంగాణ యాస లో ఇరగదీసింది. అలాగే తనికెళ్ళ భరణి శ్రీనివాస్ అవసరాల కూడా తెలంగాణ యాస లో నవ్వుల పువ్వులు పూయించారు. మొత్తంగా అమీ తుమీ తిరుగులేకుండా దూసుకునిపోతుంది.