అల్లు అర్జున్ బాక్సాఫీస్ విన్యాసాల మాట అటుంచితే నెట్‌లో అతని చిత్రాలకి విచిత్రమైన విషయాలు జరుగుతుంటాయి. అతని సినిమా టీజర్లకి, అతని చిత్రానికి సంబంధించిన వీడియోలకి, అతని ఫేస్‌బుక్ లైక్స్, ట్విట్టర్ ఫాలోవర్స్ ఇలా ఏది చూసినా టాలీవుడ్‌కి అతనే పెద్ద స్టార్ అనిపించేలా ట్రెండ్ నడుస్తుంటుంది.
కానీ క్లియర్‌గా మహేష్, పవన్ కంటే చాలా వెనక వున్నాడనేది అతని సినిమాల బిజినెస్ స్టాట్స్ చెబుతుంటాయి. తాజాగా అల్లు అర్జున్ ఖాతాలో మరో నమ్మలేని నిజం చేరిపోయింది. అతని సరైనోడు చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్‌ని యూట్యూబ్‌లో పెడితే మూడు రోజులు తిరగకుండా కోటీ అరవై లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి.
అవును కరక్ట్‌గానే చదివారు… తెలుగు వెర్షన్‌కి కాకుండా, హిందీ వెర్షన్‌కి ఈ వ్యూస్ వచ్చాయి. ఒక అనువాద చిత్రం కోసం జనం ఏ స్థాయిలో అర్రులు చాచకపోతే మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ వస్తాయి. పైగా ఇదేమీ రెండు, మూడు నిమిషాల నిడివి వున్న టీజర్ కాదు. ఫుల్ లెంగ్త్ సినిమా! మొదటి రోజే అరవై లక్షల మందికి పైగా చూసారని, లేటెస్ట్ సల్మాన్‌ఖాన్ ‘ట్యూబ్‌లైట్’ ట్రెయిలర్ కంటే మొదటి రోజు దీనికే ఎక్కువ వ్యూస్ వచ్చాయని, ఇదో రికార్డ్ అని చెప్పుకుంటున్నారు.