Movies‘బాహుబలి-2’ టూ వీక్స్ వరల్డ్‌వైడ్ షేర్.. కనీవినీ ఎరుగని స్థాయిలో లాభాలు

‘బాహుబలి-2’ టూ వీక్స్ వరల్డ్‌వైడ్ షేర్.. కనీవినీ ఎరుగని స్థాయిలో లాభాలు

‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా రిలీజైన మొదటి రోజు నుంచి కళ్లుచెదిరే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాలు వేసిన అంచనాల కంటే భారీ స్థాయిలో ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. రూ.435 కోట్లకుపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. కేవలం పదంటే పదిరోజుల్లోనే ఆ మొత్తం పెట్టుబడిని రాబట్టేసింది. అంతటితో ఆగడం లేదు.. రిలీజైన ప్రతీచోటా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. వాస్తవానికి.. రోజులు గడిచేకొద్దీ కలెక్షన్లు తగ్గుతూ వస్తాయి. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. అలాంటి పరిస్థితి కచ్ఛితంగా ఏర్పడుతుంది. కానీ.. ‘బాహుబలి-2’ విషయంలో అలా జరగకపోగా, రిలీజైన మొదట్లో ఎలా ప్రభంజనం సృష్టించిందో, అదే జోరుగా దూసుకెళ్లిపోతోంది. దీంతో.. రెండు వారాల్లోనే కనీవినీ ఎరుగని స్థాయిలో లాభాలు వచ్చిపడుతున్నాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో రూ. 612.33 కోట్లు షేర్ కొల్లగొట్టింది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా ఈ అందునా.. తెలుగు రాష్ట్రాల నుంచే రూ.160.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో రూ.39.40 కోట్లు, తమిళనాడులో రూ.51.28 కోట్లు, కేరళలో రూ.22.50, హిందీ వెర్షన్‌లో రూ.215.00 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. ఓవర్సీస్‌లో ఏకంగా రూ.124 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇలా ప్రతి ఏరియాలోనూ చితక్కొట్టిన ఈ చిత్రం.. డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఇది మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

ఏరియాల వారీగా 2 వారాల కలెక్షన్స్ (షేర్) : కోట్లలో
నైజాం : 53.58
సీడెడ్ : 27.80
నెల్లూరు : 6.21
కృష్ణా : 11.29
గుంటూరు : 14.75
వైజాగ్ : 21.26
ఈస్ట్ గోదావరి : 14.60
వెస్ట్ గోదావరి : 10.66
ఏపీ+తెలంగాణ : రూ. 160.15 కోట్లు
కర్నాటక : 39.40
తమిళనాడు : 51.28
కేరళ : 22.50
రెస్టాఫ్ ఇండియా : 215.00
ఓవర్సీస్ : 124.00
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ : రూ. 612.33 కోట్లు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news