ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఇప్పుడు ఈ పేరే సంచలనం… సుమారు దశాబ్ద కాలం ముందే ఈ సినిమా పట్టాలెక్కవలసి ఉంది… అప్పటినుంచి ఈ సినిమా చిరంజీవి కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే అప్పుడు తీస్తేనే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లు దాటేది… ఇంత బడ్జెట్ కి జడిసి ఎవరు ఈ ప్రాజెక్టు జోలికి వెళ్ళలేదు… అయితే ఇప్పుడు పెరిగిన తెలుగు సినిమా మార్కెట్, టెక్నాలజీ దృష్ట్యా సుమారు 250 కోట్ల బడ్జెట్ తో మెగాస్టార్ హీరో గా ఈ సినిమా ఇన్నాళ్ళకి పట్టాలెక్కనుంది.
భారీ బడ్జెట్ తో, అతి పెద్ద సెట్లతో, అత్యాధునిక టెక్నాలజీతో… ప్రపంచ స్థాయి నైపుణ్యం గల సాంకేతిక నిపుణలతో… ఈ అద్భుత ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథ తెరకెక్కబోతుంది..ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గా మెగాస్టార్ నటవిశ్వరూపం చూడటానికి రెండు కళ్లని, వెయ్యి కళ్లుగా మార్చుకుని సిద్ధంగా ఉండండి… “తెలుగు సినిమా చరిత్రలో మరో బంగారు అధ్యాయం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి”.